ఇండియాలోనే అత్యంత సంపన్నురాలైన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆ స్టార్ హీరోల కంటే..?

divyaamedia@gmail.com
2 Min Read

హీరోలకు ధీటుగా హీరోయిన్లు పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్‌ను బట్టి దర్శక, నిర్మాతలు కూడా అడిగినంత చెల్లిస్తున్నారు. సంపాదించిన సొమ్ముతో హీరోయిన్లందరూ ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి వాటినుంచి కూడా సొమ్మును ఆర్జిస్తున్నారు. అయితే ప్రస్తుతం సినీరంగంలో అత్యంత ఎక్కువ బడ్జెట్‏తో సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు స్టార్ హీరోస్ రెమ్యునరేషన్ గురించి చెప్పక్కర్లేదు. ఒక్కో హీరో దాదాపు రూ.100 కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటున్నారు.

అలాగే హీరోయిన్స్ సైతం ఓ రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. కానీ మీకు తెలుసా.. ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఎవరో..? సినిమాలు ఎక్కువ చేయలేదు.. అంతగా ఫాలోయింగ్ కూడా సంపాదించుకోలేదు.. కానీ ఇప్పుడు భారతదేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ గా సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఒకప్పుడు ఆడపాదడపా సినిమాలు చేసిన ఆ బ్యూటీ.. అప్పట్లో టాప్ హీరోయిన్ కూడా కాదు. అసలు పాన్ ఇండియా లెవల్లో ఆమె గురించి తెలిసింది చాలా తక్కువ మందికే. అయినా స్టార్ హీరోయిన్లను బీట్ చేసి ఆస్తులు సంపాదించింది.

తాజాగా గురువారం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ విడుదల చేయగా.. అందులో ఆ బ్యూటీ రూ.4600 కోట్ల సంపదతో టాప్ హీరోయిన్ గా నిలిచింది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా.. ? తనే జూహీ చావ్లా. బాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్. ఒకప్పుడు హిందీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఇప్పుడు ఆమె హురున్ ఇండియా నివేదిక ప్రకారం రిచెస్ట్ హీరోయిన్. సెలబ్రెటీల లిస్ట్ లో షారుక్ ఖాన్ తోపాటు స్థానం సంపాదించిన ఏకైక నటి.

ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలాంటి భారత కుబేరులు ఉన్న ఈ జాబితాలో జూహీ చావ్లా కూడా ఉండడం విశేషం. 15 ఏళ్లుగా పెద్దగా సినిమాలు చేయని జూహీ.. ఏకంగా రూ.4600 కోట్లకు యజమాని అంటే ఆశ్చర్యపోతున్నారు జనాలు. నిజానికి హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో కనీసం రూ.1000 కోట్లకు పైగా సంపద కలిగి ఉన్న భారతీయులకు చోటు దక్కుతుంది. ఈసారి ఈ జాబితాలో కొత్తగా 220 మంది చేరగా.. మొత్తం 1539 మంది ఉన్నారు. బాలీవుడ్ బాద్ షా రూ.7300 కోట్ల సంపదతో ఇండియాలోనే అత్యధిక ధనవంతుడైన సెలబ్రెటీగా నిలిచాడు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *