భారతీయుడిగా జన్మించడం తన అదృష్టమని, ఈ దేశం భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తూ, బహుళ సంస్కృతుల గళాన్ని వినిపించేందుకు అవకాశం ఇస్తుందని రెహమాన్ ఆ వీడియోలో గర్వంగా తెలిపారు. “సంగీతం ద్వారా సేవ చేయడం, గౌరవించడం మాత్రమే నా లక్ష్యం. ఉద్దేశాలను కొన్నిసార్లు అపార్థం చేసుకోవచ్చు, కానీ నా మనసులో ఉన్నది మాత్రం దేశం పట్ల ప్రేమే” అని ఆయన పేర్కొన్నారు. అయితే సైరా బాను 1973, డిసెంబర్ 20న గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించింది. నార్త్ ఇండియన్ కల్చర్‌లో పెరిగిన సైరా చాలా మృదుస్వభావి.
ఆమెకు కచ్ భాష, ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. పెళ్లికి ముందు వరకు ఆమె లైఫ్ చాలా సింపుల్‌గా, మీడియాకు దూరంగా సాగిపోయింది. రెహమాన్, సైరాలది లవ్ మ్యారేజ్ కాదు. రెహమాన్ తల్లి, సోదరి కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్ ఇది. 1995 జనవరి 6న, సరిగ్గా రెహమాన్ 28వ పుట్టినరోజు నాడు చెన్నైలోని మోతీ బాబా దర్గాలో వీరిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే, అంటే 1995 మార్చి 12న పెళ్లి పీటలు ఎక్కారు. నార్త్ ఇండియాలో పుట్టి పెరిగిన సైరా, రెహమాన్ సౌత్ ఇండియన్ జాయింట్ ఫ్యామిలీలో చాలా ఈజీగా కలిసిపోయింది.
వీరికి ఖతీజా, రహీమా అనే ఇద్దరు కూతుళ్లు, అమీన్ అనే కొడుకు ఉన్నారు. రెహమాన్ గ్లోబల్ స్టార్‌గా ఎదుగుతున్న క్రమంలో, సైరా ఫ్యామిలీని, పిల్లలని చూసుకుంటూ అతని కెరీర్‌కి పిల్లర్‌లా నిలబడింది. రెహమాన్ వర్చువల్ రియాలిటీ సినిమా లే మస్క్ కి సైరానే ఇన్‌స్పిరేషన్ కావడం విశేషం. ఆమెకు పర్ఫ్యూమ్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ ప్రాజెక్ట్‌కి హెల్ప్ అయ్యింది. 29 ఏళ్ల అన్యోన్య దాంపత్యం తర్వాత, 2024 నవంబర్‌లో ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించింది. అయితే దీనికి కారణం గొడవలు కాదని సైరా స్వయంగా క్లారిటీ ఇచ్చింది. గత రెండేళ్లుగా ఆమె కొన్ని హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతోంది.
తన ట్రీట్‌మెంట్‌పై పూర్తి దృష్టి పెట్టడానికే రెహమాన్ నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. తన అనారోగ్యం వల్ల రెహమాన్‌కు స్ట్రెస్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె లాయర్ ద్వారా తెలిపింది. వీరు కేవలం చట్టపరంగా విడిపోయారు తప్ప, విడాకులు తీసుకోలేదు. అందుకే మీడియా తనను “మాజీ భార్య” అని పిలవొద్దని సైరా రిక్వెస్ట్ చేసింది. విడిపోయినా రెహమాన్ మీద సైరాకు ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గలేదు. “ప్రపంచంలోనే బెస్ట్ మ్యాన్ రెహమాన్” అని, అతనో అద్భుతమైన మనిషి అని ఆమె రీసెంట్‌గా చెప్పింది.
తమ పర్సనల్ లైఫ్ గురించి తప్పుడు వార్తలు రాసి రెహమాన్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయొద్దని కోరింది. ప్రస్తుతం సైరా ముంబైలో తన ఆరోగ్యంపై ఫోకస్ చేస్తుండగా, పిల్లలు కూడా తమ పేరెంట్స్ ప్రైవసీని కాపాడాలని కోరారు. ఇది కేవలం ఆరోగ్యం కోసం తీసుకున్న గ్యాప్ తప్ప, బంధానికి ముగింపు కాదని అర్థమవుతోంది.
