ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లైఫ్ ని కొత్తగా, వాస్తవాలకు దగ్గరగా, ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించారు. ఈ సినిమాతో నిఖిల్, వరుణ్ సందేశ్ తో పాటు రాహుల్ వంటివారు వెండితెరకు పరిచయమయ్యారు. అసలు పేర్ల కంటే కూడా పాత్రల పేర్లతోనే హ్యాపీ డేస్ నటులు ఫేమస్ అయ్యారు. టైసన్, శ్రావ్స్, చందు, మధు పాత్రలు చాలా కాలం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. హ్యాపీ డేస్ ప్రధాన పాత్రల్లో అపర్ణ అలియాస్ అప్పు ఒకటి.
అయితే తాజాగా ఆమె తల్లి బెంగుళూరు పద్మ తన కూతురు గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సినిమా షూటింగ్ మొదటి రోజు తన కుమార్తె గాయత్రి (అప్పు)కు కూడా తొలి రోజు కావడంతో తాను ఒప్పుకున్నట్లు తెలిపారు. అప్పు ప్రస్తుతం వివాహమై, సంతోషంగా ఉందని, పిల్లలు సంతోషంగా ఉంటేనే తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ అవకాశం గురించి వారికి మొదట తెలియదని, ఆఫీస్‌కు వెళ్ళినప్పుడు గాయత్రికి ఆడిషన్స్ జరిగాయని పద్మ చెప్పారు.

తమన్నా తండ్రి పాత్రను పద్మ గారి భర్త పోషించారు. దర్శకుడు టీమ్ ప్రతి రోజు నటీనటులను పిలిచి, డైలాగ్స్ చదివిస్తూ అందరి మధ్య ఒక రాపోను ఏర్పరచుకునే ప్రయత్నం చేసిందని అన్నారు. అప్పటికి కూడా అప్పు పాత్రకు గాయత్రినే ఎంపిక చేశారని అధికారికంగా చెప్పలేగని. డైలాగ్స్ ప్రాక్టీస్ చేయిస్తూ, చివరకు అప్పు పాత్రకు గాయత్రిని డిసైడ్ చేసిన తర్వాత, మేక్ఓవర్ కోసం ఆమెను పార్లర్‌కు తీసుకెళ్లారని తెలిపింది. ఈ సందర్భంగా తన భర్త క్యారెక్టర్ వివరాలు అడగ్గా, అది టామ్ బాయ్ అప్పు అని తెలిసింది.
గాయత్రికి అప్పటికి పొడవాటి జుట్టు ఉండేది. పాత్ర డిమాండ్‌కు అనుగుణంగా బాయ్ కట్ చేయాలని పద్మ భర్త సూచించగా, శేఖర్ మొదట షోల్డర్ లెంగ్త్ సరిపోతుందని అన్నారు. అయితే, క్యారెక్టర్ బాగా ఒప్పించాలంటే, ఎలివేట్ అవ్వాలంటే ఇలాగే ఉండాలని పద్మ భర్త చెప్పారట. శేఖర్ కమ్ముల ఒక రచయిత, దర్శకుడిగా, క్యారెక్టర్ ఎలా ఉండాలనే దానిపై స్పష్టమైన అవగాహనతో ఉంటారు. పాత్రకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం ఆయనకు బాగా తెలుసని అన్నారు.

అందువల్ల ఆరోజు గాయత్రికి హెయిర్ కట్ చేయించారని.. హెయిర్ కట్ చేయించుకునే సమయంలో గాయత్రి చాలా ఏడ్చిందని, అందరి మీద కోపం వచ్చిందని పద్మ తెలిపారు. పిల్లలకు జుట్టు అంటే ఎంతో ఇష్టం కదా. శేఖర్ కమ్ముల ఆమెను ఓదార్చేందుకు పెద్ద క్యాడ్‌బరీస్ చాక్లెట్ ఇచ్చి, ఏడవద్దని ప్యాసిఫై చేశారు. అయితే, ఆ బాయ్ కట్ హెయిర్ స్టైలే అప్పు పాత్రకు గొప్ప ప్లస్ పాయింట్ అయ్యిందని పద్మ చెప్పారు. ప్రస్తుతం తన కూతురు పెళ్లి చేసుకుని పిల్లలు, భర్తతో సంతోషంగా ఉందని అన్నారు.
