పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 30వ తేదీ 2013లో లెజ్నెవా ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈయన నటించిన తీన్ మార్ సినిమాలో అన్నా లెజ్నెవా హీరోయిన్ గా నటించారు. అప్పుడే వీరిద్దరు కూడా ప్రేమలో పడ్డారని టాక్. ఇప్పుడు వీరిద్దరికి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు, పోలేనా అంజనా పవనోవా అనే కూతురు ఉన్నారు. అయితే తీన్‌మార్ సెట్స్‌లో చిగురించిన కొత్త ప్రేమ.. పర్సనల్ లైఫ్ ఇలా గందరగోళంగా ఉన్న సమయంలోనే.. 2011లో వచ్చిన ‘తీన్‌మార్ ’ సినిమా షూటింగ్ పవన్ లైఫ్‌ని మలుపు తిప్పింది.
ఆ సెట్స్‌లోనే రష్యన్ మోడల్, నటి అన్నా లెజ్నెవా తో పరిచయమైంది. అప్పటికే ఆమె కూడా పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది, ఓ పాప కూడా ఉంది. పవన్, అన్నా లెజ్నెవా ఆలోచనలు, అభిరుచులు కలవడంతో ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాదాపు రెండేళ్లు డేటింగ్ చేశాక, 2013 సెప్టెంబర్ 30న పెద్దగా హడావిడి లేకుండా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఉన్నాడు. అన్నా లెజ్నెవా గురించి బయట పెద్దగా ఎవరికీ తెలియని విషయం ఒకటుంది. ఆమె కేవలం సాధారణ గృహిణి మాత్రమే కాదు.. సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ అని టాక్.

ఆమెకు సింగపూర్, రష్యాల్లోని హోటల్ చైన్స్, ఇతర ఆస్తుల రూపంలో దాదాపు రూ.1800 కోట్ల ఆస్తులు ఉన్నాయనే రిపోర్ట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. విడిపోయారన్న రూమర్స్‌కి చెక్.. అంతా బాగుందనుకుంటున్న సమయంలో.. 2023 మధ్యలో పవన్, అన్నా విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ రూమర్స్ వచ్చాయి. మెగా ఫ్యామిలీలో జరిగిన వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్, ఉపాసన పాప బారసాల వంటి ఈవెంట్స్‌లో అన్నా కనిపించకపోవడంతో.. ఆమె పిల్లలతో ఫారెన్ వెళ్లిపోయిందంటూ పుకార్లు షికారు చేశాయి.
10 ఏళ్ల బంధానికి బ్రేక్ పడిందని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే పవన్ తన పొలిటికల్ యాత్రకు సంబంధించిన పూజా కార్యక్రమంలో భార్యతో కలిసి పాల్గొని అందరి నోళ్లు మూయించాడు. ప్రస్తుతం వీళ్ల ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా సాగిపోతోంది. కెరీర్ పర్సనల్ లైఫ్ సంగతి పక్కన పెడితే.. పవన్ లేటెస్ట్ మూవీ ‘OG’ 2025, సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యి థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. మరో వైపు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినా.. రిలీజ్ డేట్ పై ఇంకా అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
