తమన్నా ఆస్తుల విలువ ఇదంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. తమన్నాకు హ్యాపీ డేస్, 100% లవ్ చిత్రాలు ఫేమ్ తెచ్చాయి. అనంతరం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు హిందీలో కూడా చేసింది. ప్రస్తుతం తమన్నా సినిమాకు రెండు కోట్లకు పైనే తీసుకుంటుంది. అయితే షూటింగ్స్, ట్రావెలింగ్ అంటూ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా, తమన్నాకు ఈ ఇల్లే అసలైన స్వర్గం. గత తొమ్మిదేళ్లుగా ఆమె ఇక్కడే ఉంటోంది. విశేషం ఏంటంటే..
ఈ ఇంటిని తమన్నా వాళ్ల నాన్నే దగ్గరుండి మరీ తన అభిరుచికి తగ్గట్టు డిజైన్ చేయించాడు. బయట ఎంత స్ట్రెస్ ఉన్నా, ఇంట్లోకి రాగానే మనసుకు ప్రశాంతతనిచ్చేలా, ఎక్కువగా వైట్ కలర్ థీమ్‌తో క్లాసీగా తీర్చిదిద్దుకున్నాడు. గోడలకు తెలుపు రంగు ఉన్నా, అక్కడక్కడ కలర్‌ఫుల్ వస్తువులతో ఇంటికి కొత్త కళ తీసుకొచ్చాడు. లివింగ్ రూమ్‌లోకి అడుగుపెట్టగానే ఐవరీ కలర్ లో ఉన్న ఎల్-షేప్ సోఫా గ్రాండ్‌గా స్వాగతం పలుకుతుంది. గది మధ్యలో డిఫరెంట్ షేప్‌లో ఉండే గ్లాస్ టేబుల్ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది.
రూమ్ కాస్త చిన్నదైనా, పెద్దగా కనిపించేందుకు ఒకవైపు భారీ గ్లాస్ వాల్ ఏర్పాటు చేశారు. దీనికి వేసిన పలుచటి కర్టెన్లు గదికి రాయల్ లుక్ ఇచ్చాయి. లివింగ్ రూమ్‌కి ఆనుకొనే ఫార్మల్ డైనింగ్ ఏరియా ఉంటుంది. అక్కడ ఎనిమిది మంది కూర్చునేలా ఒక డైనింగ్ టేబుల్ ఉంది. ఇక్కడ మరో హైలైట్ ఏంటంటే.. తమన్నా వదిన స్వయంగా గీసిన గౌతమ బుద్ధుడి పెయింటింగ్ గోడకు అద్భుతంగా సెట్ అయ్యింది. ఇల్లంతా ఒకెత్తయితే, కిచెన్ మరొక ఎత్తు.
ఇది పూర్తిగా వైట్ అండ్ వైట్ థీమ్‌లో మెరిసిపోతుంటుంది. పారలల్ లేవుట్ లో డిజైన్ చేసిన ఈ మాడ్యులర్ కిచెన్‌కి సన్ లైట్ బాగా తగులుతుంది. తమన్నా తన తల్లిదండ్రులతో కలిసి కాఫీ, స్నాక్స్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడే కిటికీ పక్కన ఉన్న బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్‌ని వాడుతుందట. హీరోయిన్ అన్నాక మేకప్ రూమ్ స్పెషల్‌గా ఉండాలి. అందుకే తమన్నా తన బెడ్‌రూమ్‌కి వెళ్లే దారిలోనే ఒక స్పెషల్ మేకప్ రూమ్‌ని ప్లాన్ చేసుకుంది. గది ఇరుగ్గా లేకుండా స్పేషియస్‌గా కనిపించేలా గోడలకు అద్దాలు అమర్చారు. మేకప్ వేసుకోవడానికి పర్ఫెక్ట్ నేచురల్ లైట్ వచ్చేలా పెద్ద కిటికీ ఉంది.
బట్టలు పెట్టుకోవడానికి స్లైడింగ్ వార్డ్‌రోబ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ అసలైన అట్రాక్షన్ ఏంటంటే.. కిటికీ వైపు గోడపై ఉన్న ‘బటర్‌ఫ్లై’ (సీతాకోకచిలుక) డిజైన్. ఇది ఆ గదికే చాలా ప్లేఫుల్ టచ్ ఇచ్చింది.
