ఒక్కోసారి హీరో పక్కన కేవలం కొన్ని సెకన్ల పాటు కనిపించినా సరే.. కొందరు యాక్టర్స్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ యష్ ‘టాక్సిక్’ విషయంలో అదే జరిగింది. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి అందరూ యష్ గురించి మాట్లాడుకుంటుంటే.. సోషల్ మీడియాలో మాత్రం ఓ కొత్త అమ్మాయి టాపిక్ వైరల్ అవుతోంది.
ఇదిలాఉంటే టీజర్ వీడియోలో.. బ్యాక్‌గ్రౌండ్‌లో స్మశానం, కారులో యష్ కనిపిస్తాడు. యష్ పక్కన ఓ అమ్మాయి ఉంటుంది. కారు వెనుక బాంబు కనిపిస్తున్నా.. ఇద్దరూ చాలా కూల్‌గా, ఒక రకమైన ఇంటెన్స్ రొమాంటిక్ మూడ్‌లో కనిపిస్తారు. అంతలోనే భారీ బాంబ్ బ్లాస్ట్, గన్ ఫైరింగ్.. పొగలోంచి యష్ మాస్ ఎంట్రీ… యష్ స్వాగ్, ఆటిట్యూడ్ అదిరిపోయినా.. నెటిజన్ల కళ్లు మాత్రం ఆ కారులో యష్ పక్కన ఉన్న అమ్మాయి మీదే పడ్డాయి.
ఆ బోల్డ్ లుక్‌లో కనిపించిన ఆ మిస్టరీ గర్ల్ ఎవరంటూ గూగుల్ తల్లిని అడగడం మొదలుపెట్టారు. దీనిపై కూడా డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ సీన్ ఫోటో షేర్ చేస్తూ.. “ఈ బ్యూటీ నా సెమిటరీ గర్ల్ బియాట్రిస్” అంటూ అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు ఆమె ఎవరో కాదు.. బియాట్రిస్ టౌఫెన్‌బాచ్ .
కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లో రిలీజ్ చేయనున్నారు. మార్చి 19న ఈ సినిమా విడుదల కానుంది.
