ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తున్న విషయాలలో.. శివాజీ కామెంట్లు.. అనసూయ రిప్లైలతో పాటు నా అన్వేషణ కూడా చేరాడు. ఈమ్యాటర్ లో అనవసరంగా దూరి.. మొదటికే మోసం తెచ్చుకున్నాడు నా అన్వేషణ యూట్యూబర్. ప్రస్తుతం ఎక్కడ చూసినా అన్వేష్ పేరు మారుమోగిపోతోంది. అతను మాట్లాడిన తీరు అందరికి చిరాకు తెప్పిస్తుంది. అయితే అన్వేష్ గరికపాటిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
కొద్ది రోజుల క్రితం అన్వేష్ తనను విమర్శించడంపై.. పరోక్షంగా గరికపాటి స్పందించారు. ఈ నేపథ్యంలో అన్వేష్ ఒక వీడియో విడుదల చేస్తూ గరికపాటిని ఉద్దేశించి.. వ్యంగ్యంగా మాట్లాడుతూ.. వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అన్వేష్ మాట్లాడుతూ, “గరికపాటి గారు నా మీద యుద్ధం ప్రకటిస్తారా? మీరు నన్నెవరనుకుంటున్నారు? నేను సాక్షాత్తు బ్రహ్మదేవుడిని. నేను ఒక అవతార పురుషుడిని అనే విషయం రీసెంట్గా తెలిసింది. మీరు విష్ణుమూర్తి అవతారం, చాగంటి గారు మహాశివుడు.
మన ముగ్గురం త్రిమూర్తుల్లాంటి వాళ్లం. త్రిమూర్తులు స్నేహితులు, స్నేహితుల మధ్య యుద్ధం ఎందుకు? మనం కారణజన్ములం, ఈ దేశాన్ని ఉద్దరించడానికి ఈ అవతారాలు ఎత్తాం” అంటూ ఎగతాళి చేస్తూ.. మాట్లాడాడు. నా అన్వేషణ ఛానెల్ పై, అన్వేష్ పై ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కేసులు నామోదు అయ్యాయి. ప్రముఖ నటి, బీజేపీ నేత కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైన విషయం తెలిసిందే.
అతడిని అరెస్ట్ చేయాలంటున్న హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. దాంతో అన్వేష్‌ను రప్పించడానికి అన్నిరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పోలీసులు అన్వేష్ యూజర్ ID వివరాలు ఇవ్వాలని ఇన్స్టాగ్రామ్ కు లేఖ రాశారు. ఇన్‌స్టా నుంచి వచ్చే రిప్లై కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. అన్వేష్ ఇండియాకు వచ్చిన వెంటనే అరెస్ట్ చేస్తారని సమాచారం.
