సీనియర్ హీరోయిన్ కస్తూరి.. సీరియల్ నటిగా మారింది నటించిన తొలి సీరియల్ ‘గృహలక్ష్మి’. స్టార్ మా ఛానల్లో ప్రసారం అయిన ఈ సీరియల్ 1158 ఎపిసోడ్లు ప్రసారం అయ్యి.. దాదాపు నాలుగేళ్లు సాగింది. ఈ సీరియల్తో తెలుగు ఆడియన్స్కి బాగా చేరువైంది కస్తూరి శంకర్. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో కస్తూరి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నటి కస్తూరి శంకర్ తన జైలు జీవితంలోని వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ఆమె జైలులో ఉన్నప్పుడు ఒంటరితనం తనను ఎంతగానో కలచివేసిందని, ఆ రాత్రంతా ఎలా గడిచిందో తెలియక పదే పదే ప్రశ్నించుకున్నానని తెలిపారు. జైలులోకి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆభరణాలు లేదా ఇతర వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతించరని కస్తూరి వెల్లడించారు. లోపలికి వెళ్లడమే ఒక పెద్ద సాహసమని ఆమె పేర్కొన్నారు.
జైలులోకి వెళ్ళేటప్పుడు స్ట్రిప్ సెర్చ్ చేస్తారని అని కస్తూరి తెలిపారు. ఈ స్ట్రిప్ సెర్చ్ లో ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఎలా ఉంటాడో అలానే ఉండాలని, అంటే శరీరంతో పాటు ఎటువంటి వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతి ఉండదని ఆమె అర్థం వివరించారు. మహిళా ఖైదీల కోసం ఈ తనిఖీని మహిళా సిబ్బందే నిర్వహిస్తారని ఆమె తెలిపారు. శరీరంపై ఎక్కడైనా, పళ్లలో, లేదా శరీరంలోని సున్నితమైన భాగాలలో ఏదైనా దాచి ఉంచారా అని క్షుణ్ణంగా పరిశీలిస్తారని పేర్కొన్నారు.
అంతేకాకుండా, మూడు సార్లు కూర్చొని నిలబడమని (స్క్వాట్స్) అడుగుతారని, ఇది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందని తెలిపారు కస్తూరి. ఈ ప్రక్రియ మానసికంగా చాలా కష్టమైనదని కస్తూరి అన్నారు, అయినప్పటికీ ఇది జైలు నిబంధనలలో ఒక భాగమని ఆమె చెప్పుకొచ్చారు.
