జాతక పొంతన ప్రాముఖ్యతజ్యోతిషశాస్త్రం ప్రకారం అష్టకూట గుణ మేళనం చూస్తారు. ఇందులో మొత్తం 36 గుణాలు ఉంటాయి. కనీసం 18 గుణాలు కలిస్తేనే వివాహానికి అనుమతిస్తారు. జాతకాలు కలవకపోతే దంపతుల మధ్య మనస్పర్థలు, ఆరోగ్య సమస్యలు, సంతాన లేమి లేదా ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని జ్యోతిష్కులు హెచ్చరిస్తారు. ముఖ్యంగా ‘మంగళ దోషం’ (కుజ దోషం), ‘గణ దోషం’ వంటివి తీవ్రంగా ఉంటే వివాహానికి దూరంగా ఉండటం మంచిదని సూచిస్తారు.
అయితే ఇప్పుడంటే.. పిల్లలు ఏరోజు ఏ సమయంలో పుట్టారు అనే విషయం అందరికీ తెలుస్తోంది. దీనిని బట్టి జాతకం కూడా ఈజీగా రాయించగలం.కానీ పూర్వం అలా ఉండేది కాదు. అందరికీ జాతకాలు రాయించే అలవాటు ఉండేది కాదు. దాని వల్ల జాతకాలు సరిపోయాయా లేదా అనే సందేహం ఉండేది కొన్ని సార్లు పురుషుడి జాతకం మాత్రమే ఉండి.. స్త్రీకి ఉండేది కాదు. మరికొన్నిసార్లు స్త్రీకి ఉంటే, పురుషులకు ఉండదు. అటువంటి సమయంలో పెళ్లిళ్లు చేసుకొని వారి మధ్య ఏదైనా తేడాలు వచ్చినా జాతకం కలవకపోవడం వల్లే ఇలా జరిగింది అనేవాళ్లు.

జాతకాలు కలవకపోయినా ఇవి కలవాల్సిందే.. జాతకం చూడకుండా పెళ్లి చేసుకోవాలంటే మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి గురించి కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇద్దరి కుటుంబాల వాతావరణం, వారి ఆలోచనా సరళి, జీవన విధానం సమానంగా ఉన్నాయా? అని చూసుకోవాలి. లేకపోతే, వైవాహిక జీవితం సాఫల్యవంతంగా కొనసాగడం కష్టమవుతుంది.సమస్యలు, కష్టాలు వస్తాయి. జ్ఞానం, ఆలోచనా విధానం, ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకునే తీరు ఒకేలా ఉన్నాయా? ఒకరు ఆర్థికంగా బాధ్యతగా ఉంటే, మరొకరు నిర్లక్ష్యంగా ఉంటే, అనర్థాలు తప్పవు.
ఈ విషయాల్లో ఇద్దరి మధ్య తేడాలు లేకుండా చూసుకోవాలి. ఇద్దరి అభిప్రాయాలు కలిస్తేనే పెళ్లికి సిద్ధం కావాలి. భావోద్వేగాలను ఒకరినొకరు అర్థం చేసుకోగలరా? కొందరు ప్రేమ వివాహం చేసుకున్నా, కొద్ది కాలంలోనే విడిపోతుంటారు. ఇది వారి మానసిక అనుకూలత లేకపోవడమే కారణం. కొంతమంది సహజంగా కోపంగా ఉంటారు, మరికొందరు శాంతస్వభావులుగా ఉంటారు. కానీ నిజమైన వ్యక్తిత్వం వాటిని మించినది. ఒకరి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకరినొకరు అర్థం చేసుకుంటే దాంపత్య జీవితంలో సమస్యలు రాకుండా ఉంటాయి.

ఆరోగ్యపరంగా జీవనశైలి ఎలా ఉంది? దీర్ఘకాలిక అనారోగ్యం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఈ ఐదు అనుకూలతలు ఉన్నట్లయితే, జాతకం చూడకుండానే మీరు వివాహ నిర్ణయం తీసుకోవచ్చు. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జాతక పరిశీలన ఇంకా అవసరమే.
