అమెక్స్ బ్లాక్ కార్డ్ ఏ ఇతర బ్యాంకు లాగా ప్రామాణిక దరఖాస్తు ప్రక్రియ ద్వారా లభించదు. దీన్ని పొందడానికి మీకు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ నుండి ప్రత్యేక ఆహ్వానం అవసరం. 1999 లో ప్రారంభించబడిన ఈ కార్డు 1980 ల నుండి వార్తల్లో ఉంది. కానీ దాని హోల్డర్లు చాలా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా కేవలం లక్ష మందికి మాత్రమే ఈ కార్డు ఉన్నట్టుగా సమాచారం. భారతదేశంలో అమెక్స్ బ్లాక్ కార్డ్ కలిగిన వారు కేవలం 200 మంది మాత్రమే ఉన్నరట. కాగా, ఇది 2013లో భారత మార్కెట్లోకి ప్రవేశించిందని సమాచారం. అయితే ఈ సాధారణ నియమాలకు పూర్తిగా భిన్నంగా, ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన క్రెడిట్ కార్డు ఉంది.
దానికి ఎలాంటి ఖర్చు పరిమితి ఉండదు. అదే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రెడిట్ కార్డుగా పేరొందిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సెంచూరియన్ కార్డ్, సాధారణంగా ‘అమెక్స్ బ్లాక్ కార్డ్’ అని పిలుస్తారు. క్రెడిట్ కార్డ్ ప్రపంచంలో ఇది నిజంగా రాజుగా పరిగణించబడుతుంది. ఈ కార్డు కలిగి ఉండటం సంపద, ప్రతిష్ఠ మరియు ఆర్థిక స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ కార్డు యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, దీనికి ముందుగా నిర్ణయించిన ఖర్చు పరిమితి ఉండదు. సాధారణ కార్డుల్లా “లిమిట్” అనే భావనే ఇందులో ఉండదు. మీరు ఈ కార్డుతో ఖరీదైన లగ్జరీ కార్లు కొనుగోలు చేయవచ్చు, విలువైన ఆభరణాలు లేదా వజ్రాలు తీసుకోవచ్చు, అంతేకాదు అవసరమైతే ప్రైవేట్ జెట్ల వరకు కూడా కొనుగోలు చేసే సామర్థ్యం ఈ కార్డు ఇస్తుంది.

అంతేకాదు, ఈ కార్డు టైటానియం మెటల్‌తో తయారు చేయబడటం వల్ల, ఇది సాధారణ ప్లాస్టిక్ కార్డుల కంటే బరువుగా, ప్రీమియం రూపంలో ఉంటుంది. అయితే ఈ అపరిమిత శక్తిని ఇచ్చే కార్డును పొందడం మాత్రం చాలా కష్టం. ఇది సాధారణంగా బ్యాంకులో దరఖాస్తు చేసి పొందే కార్డు కాదు. అమెక్స్ బ్లాక్ కార్డ్ పూర్తిగా ఆహ్వానం ద్వారా మాత్రమే లభిస్తుంది. ఎవరు ఈ కార్డుకు అర్హులు అనే విషయాన్ని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సంస్థ స్వయంగా నిర్ణయిస్తుంది. సెంచూరియన్ కార్డు 1999లో అధికారికంగా ప్రారంభించబడినప్పటికీ, దీని గురించిన కథలు మరియు పుకార్లు 1980ల నుంచే వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇది కేవలం ఒక పురాణంగా మాత్రమే భావించబడింది.
బ్రూనై సుల్తాన్ లేదా అమెక్స్ సీఈఓ లాంటి కొద్దిమంది అతి సంపన్నుల వద్ద మాత్రమే ఈ కార్డు ఉందని చెప్పేవారు. నేటికీ ఈ కార్డు ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన మరియు అరుదైన క్రెడిట్ కార్డులలో ఒకటిగా కొనసాగుతోంది. అంచనాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఈ కార్డు వినియోగదారుల సంఖ్య లక్షకు కూడా తక్కువగా ఉంటుంది. అమెరికాలో మాత్రమే దాదాపు 20,000 మంది ఈ కార్డును ఉపయోగిస్తున్నారని అంచనా. అంటే ఇది ఎంత అరుదైనదో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో అయితే ఈ కార్డు యజమానుల సంఖ్య మరింత తక్కువగా ఉంది. నివేదికల ప్రకారం, దేశవ్యాప్తంగా దాదాపు 100 మంది మాత్రమే అమెక్స్ బ్లాక్ కార్డును ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ కార్డును పొందేందుకు ఎలాంటి సాధారణ అప్లికేషన్ ప్రక్రియ ఉండదు. అయితే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వద్ద మీ ఖర్చుల చరిత్ర బలంగా ఉండాలి. సాధారణంగా, అమెక్స్ ప్లాటినం కార్డు ద్వారా సంవత్సరానికి కనీసం 3.5 లక్షల నుంచి 5 లక్షల డాలర్ల వరకు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు) ఖర్చు చేసి, ఆ మొత్తాన్ని సకాలంలో చెల్లించాలి. దీనితో పాటు, మీ క్రెడిట్ స్కోరు అత్యుత్తమంగా ఉండాలి, మీ నికర ఆస్తి విలువ చాలా ఎక్కువగా ఉండాలి మరియు అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌తో మీకు దీర్ఘకాలిక సంబంధం ఉండాలి. కొన్నిసార్లు అమెక్స్ వెబ్సైట్లో ‘రిక్వెస్ట్ ఇన్వైట్’ ఫారమ్‌ను పూరించే అవకాశం ఉన్నప్పటికీ, తుది నిర్ణయం మాత్రం పూర్తిగా అమెక్స్ చేతుల్లోనే ఉంటుంది.
