బ్రేకింగ్ న్యూస్, అర్ధరాత్రి ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం.

divyaamedia@gmail.com
1 Min Read

ఎర్నాకుళం వెళ్లే టాటా-ఎర్నాకుళం(18189) ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ అగ్నిప్రమాదానికి గురైంది. ప్రయాణికులు గాఢనిద్రలో ఉండగా ఆదివారం (డిసెంబర్ 28) అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. రాత్రి 1.30గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రైలులోని ప్యాంట్రీ కారుకి పక్కపక్కనే ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన లోకో పైలట్లు ఎలమంచిలి సమీపంలోని రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపేశారు.

అయితే ప్రమాదంలో ఒకరు మృతిచెందనట్టు గుర్తించామని అన్నారు. చనిపోయిన వ్యక్తి 71 సంవత్సరాల వ్యక్తని, పెద్ద వయసుకావడంతో ఆయన బయటికి రాలేకపోయారని SP తెలిపారు. మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చామన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేయించామని, వేరే ట్రైన్‌ కూడా ఏర్పాటు చేసి వారిని ఎర్నాకుళం పంపించామన్నారు. FSL రిపోర్ట్ తర్వాత పూర్తివివరాలు తెలుస్తాయని SP తుహిన్ సిన్హా మీడియాకు తెలిపారు.

B1 కోచ్‌ ఎలక్ట్రికల్‌ ప్యానల్‌ నుంచి మంటలు చేలరేగినట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. B1, M2 కోచ్‌ల్లో పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఫైర్‌ సిబ్బంది అతికష్టంమీద వాటిని ఆర్పారు. మంటల దాటికి భారీగా పొగలు కమ్మేయడంతో రెస్క్యూ ఆపరేషన్‌ కష్టమైంది. రెస్క్యూ టీమ్స్‌ కోచ్‌ అద్దాలను పగలకొట్టి ప్రయాణికులను క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. అందరూ గాఢనిద్రలో ఉండగా మంటలు చెలరేగాయి. కోచ్‌లో పోలీ మెటీరియల్‌, దుప్పట్లు ఉండటంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి.

అయితే, టీటీఈ, లోకో పైలట్‌ అప్రమత్తతతో భారీ ప్రాణనష్టం తప్పింది. అనకాపల్లి తర్వాత.. ఎలమంచిలి స్టేషన్‌ సమీపిస్తుండగా.. రైల్‌ బ్రేక్‌ జామ్‌ అయ్యింది. దాంతో, లోకో పైలట్‌ అప్రమత్తమయ్యాడు. వెనక్కి చూసేసరికి ఓ కోచ్‌ నుంచి మంటలను గమనించి ట్రైన్‌ను నిలిపివేశాడు. వెంటనే, ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో భారీ ప్రాణనష్టం తప్పిందని అన్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *