OYO ROOM : ఓయో రూముల్లో సీక్రెట్ కెమెరాలు, జంటల రొమాంటిక్ సీన్స్ రికార్డ్ చేసి ఏం చేస్తున్నారో తెలుసా..?
OYO ROOM : ఓయో హోటల్స్‌లో రహస్య కెమెరాలు పెట్టి, దంపతుల సన్నిహిత దృశ్యాలను చిత్రీకరిస్తూ.. భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఓయో రూములు అంటే అందుకు మాత్రమే అని జనాల్లో బాగా ముద్రపడిపోయింది. తాజాగా జరిగిన ఓ ఘటన చూస్తే.. ఇకపై ఓయో రూమ్స్‌కు వెళ్లాలంటే..భయపడతారేమో..! ఓయో హోటల్స్‌లో రహస్య కెమెరాలు పెట్టి, అక్కడికి వచ్చే జంత రొమాంటిక్ దృశ్యాలను చిత్రీకరిస్తూ.. భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్న హోటల్ యజమాని బండారం బయటపడింది. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర సంచలనం రేపుతోంది.
Also Read: నిత్యజీవితంలో కూడా భర్తతో కష్టాలు పడుతున్న ‘కార్తిక దీపం’ వంటలక్క.
హైదరాబాద్ శివారు శంషాబాద్ సిటా గ్రాండ్ ఓయో హోటల్ లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలుకు చెందిన గణేష్ అనే వ్యక్తి ఓయో హోటల్ నడిపిస్తున్నాడు. బెడ్ రూంలలోని బల్బ్ లలో సీక్రెట్ కెమెరాలు ఉంచి జంటల సన్నిహిత దృశ్యాలను రికార్డు చేసి.. రికార్డులో ఉన్న వారి వివరాలు ఆధారంగా ఫోన్లు చేసి బ్లాక్ మెయిట్ చేస్తున్నాడు. అందినంత ఇవ్వకుంటే వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తుండేవాడు. పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
నిందితుడు ఎక్కువగా లాడ్జ్ కు వచ్చే యువతనే టార్గెట్ చేసేవాడని పోలీసులు తెలిపారు. అంతకుముందు కూడా.. ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలోని పలు ఓయో హోటళ్లలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా కెమెరాలు అమర్చి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడే ముఠాగుట్టు రట్టు చేశారు పోలీసులు. ఓయో హోటల్‌కు వెళ్లి దంపతుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారు తీసుకున్న రూమ్‌లో కెమెరాలు ఉన్నట్టు వారికి తెలియదు. ఆ తర్వాత గదిని వెకేట్ చేసి వెళ్లిపోయారు. కొన్ని రోజులకు ఈ నేరస్థుల బృందం మళ్లీ ఆ ఓయో రూమ్‌కి వెళ్లింది. సీక్రెట్ కెమెరాలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.
Also Read: స్త్రీ పురుషులిద్దరు పెళ్లికి ముందు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటో తెలుసా..?
ఓ కెమెరాలో.. దంపతులు సన్నిహితంగా ఉన్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వారిని ట్రాక్ చేసింది ఆ బృందం. డబ్బులు ఇవ్వకపోతే, వీడియోలను వైరల్ చేస్తామని బెదిరించింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. దర్యాప్తు ముమ్మరం చేయగా.. ఇందులో హోటల్ సిబ్బంది పాత్ర లేదని తేలింది. విష్ణు సింగ్, అబ్దుల్ వాహవ్, పంకజ్ కుమార్, అనురాగ్ కుమార్ సింగ్‌లు.. మూడు వేరువేరు గ్యాంగ్స్‌కు సంబంధించిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.