గత కొన్ని రోజులుగా ఆయన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారంటూ ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి వేదికల్లో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలు చూసిన ఆయన అభిమానులు, నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. దీంతో రంగంలోకి దిగిన మహ్మద్ పాషా, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తన మరణంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని స్పష్టం చేస్తూ స్వయంగా మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు.
అయితే ఈ మధ్యన ఈ పెద్దాయన పెద్దగా కనిపించడం లేదు. సోషల్ మీడియాలోనూ సందడి చేయడం లేదు. ఇక నిన్నటి నుంచి అయితే కుర్చీ తాత చనిపోయారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. గాంధీ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచాడని రూమర్లు వినిపించాయి. దీంతో ఈ విషయం నిజమనుకుని చాలా మంది కుర్చీతాత RIP అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.
అయితే ఇదంతా అబద్ధమని తేలింది. ఈ ఫేక్ న్యూస్‌పై స్పందించిన ప్రముఖ యూట్యూబర్ వైజాగ్ సత్య, కుర్చీ తాత భార్యతో కలిసి వీడియో విడుదల చశాడు. ఈ సందర్భంగా ఆమె తన భర్త చనిపోలేదని, ప్రస్తుతం వరంగల్ లో ఉన్నాడని క్లారిటీ ఇచ్చింది . ఇదే వీడియోలో వైజాగ్ సత్య మాట్లాడుతూ.. గాంధీ ఆస్పత్రిలో చనిపోయింది కుర్చీతాత కాదని, ఆయన ఎక్కడున్నా క్షేమంగానే ఉండి ఉంటాడని చెప్పుకొచ్చారు. అనంతరం కుర్చీ తాత స్వయంగా మీడియా ముందుకు వచ్చారు.
తాను చనిపోలేదని, ఇలాంటి తప్పుడు వార్తలతో నా కుటుంబాన్ని బాధ పెట్టోద్దని అభ్యర్థించారు. ‘నేను చనిపోలేదు, బతికే ఉన్నాను. ఆరోగ్యంగానే ఉన్నాను. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దు, మా కుటుంబాన్ని బాధపెట్టకండి. ఈ వార్త ఎవరైతే రాశారో వాళ్లు కనిపిస్తే కచ్చితంగా నేను చంపేస్తాను. నా మరణ వార్త విని నా భార్య కూడా కంగారుపడింది. బాగా ఏడ్చింది’ అని కుర్చీతాత ఆవేదన వ్యక్తం చేశారు.
