ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాము ఒకటి.. కొన్ని పాములు చాలా ప్రమాదకరమైనవి… అవి కొన్ని సెకన్లలో మనిషిని చంపగలవు. ఇక చాలా రకాల పాములు మనుషులకు భయపడతాయి. మరోవైపు పాముల గురించి చాలా అపోహలు ఉన్నాయి. అయితే ప్రపంచంలో దాదాపు 3000 వేలకుపైగా పాము జాతులు ఉన్నాయి. వాటిలో కొన్ని ఎలాంటి హాని తలపెట్టినవి.
అయితే.. మరికొన్ని ప్రాణాంతకమైనవి.. ఇవి క్షణాల్లో మానవుల ప్రాణాలను తీసేయగలవు. అందులో మొదటి స్థానంలో ఉన్నది మొజాంబిక్ స్పిట్టింగ్ కోబ్రా.. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పామట.. ఈ పాము తన శత్రువుపై లేదా వేటాడే జంతువుపై 9 అడుగుల దూరం నుండి విషాన్ని ప్రయోగించగలదట. ఇది తన కోరల రంధ్రాల ద్వారా ఫౌంటెన్ లాగా ఈ విషాన్ని బయటకు చిమ్ముతుందట.

ఈ పాము ప్రత్యేకత ఏంటంటే.. దాని టార్గెట్ను ఎప్పుడూ మిస్సవ్వదట.. దాడి సమయంలో దాని దృష్టి మొత్తం టార్గెట్పైనే ఉంటుందట. ఇది తనపై దాడి చేసే శత్రువు కళ్లను, కదలికలను గమనిస్తూ.. సరైన సమయం చూసి విషాన్ని ప్రయోగిస్తుందట. తద్వారా విషం గరిష్ట ప్రాంతంలో వ్యాపించి కళ్ళలోకి ప్రవేశిస్తుంది.
ఈ పాము విషం ఒక వేళ మనిషి కళ్లలో పడితే.. అతనికి వెంటనే చికిత్స చేయించాలి.. కాస్త లేటైన అతని కంటిచూపు పోవచ్చట. ఎందుకంటే ఈ పాము విషం కంటి కణాలకు తీవ్రంగా దెబ్బతీస్తుందట. దీని విషాన్ని సైటోటాక్సిక్ అంటారు. ఈ విషం చర్మ కణాలు, కణజాలాలను నాశనం చేస్తుంది, దీని విషం మన శరీరంపై పడితే గాయాలు, వాపులు.

ఆ విషం పడిన ప్రాంతం మొత్తం కుళ్ళిపోవడం జరుగుతుందట. ఈ పాములు సాధారణంగా 4 నుండి 6 అడుగుల పొడవు ఉంటాయి, వీటిలో కొన్ని జాతులు పెద్దవిగా ఉంటాయి. ఇవి బూడిద, గోధుమ లేదా నలుపు రంగులో ఉంటాయి. ఇవి చూడ్డానికి కూడా చాలా భయంకరంగా కనిపిస్తాయి. ఈ పాము ఎక్కువగా ఆఫ్రికా, ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది.
