మాఫియా సినిమాను తలపించే ఈ ఘటన అనంతపురం జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం అరవింద నగర్‌లోని ఓ కేఫ్ వద్ద దేవరకొండ అజయ్, చాకలి రాజా, సొహైల్, అక్రమ్ అనే నలుగురు ఆదివారం రాత్రి మద్యం తాగారు. మద్యం విషయంలో రాజా, అజయ్ మధ్య గొడవ జరిగింది.
రాజాను అజయ్ కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు, సోమవారం ఉదయం నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లారు. అయితే అయితే అనంతపురం శివారు ఆకుతోటపల్లిలో నిందితుడు అజయ్ ఉన్నట్లు సమాచారం రావడంతో. అనంతపురం టు టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ తన నిందితుడిని పట్టుకునేందుకు తనసిబ్బందితో బయల్దేరాడు.

అజయ్ చెరుకు తోటలో దాక్కున్నట్టు గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలో నిందితుడు అజయ్ సీఐ శ్రీకాంత్ యాదవ్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో సీఐ ఒక్కసారిగా గాల్లో కాల్పులు జరిపారు. అయినా అజయ్ వెనక్కి తగ్గలేదు.. మళ్లీ సీఐపై కత్తితో దాడి చేశాడు. ఇక చేసేదేమి లేక.. ఎస్ఐ అజయ్‌పై కాల్పులు జరిపాడు. దీంతో అజయ్ అక్కడికక్కడే కుప్పకూలాడు.
ఇక వెంటనే అక్కడికి చేరుకున్న మిగతా సిబ్బంది. అజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అజయ్‌తో పాటు ఎస్ఐను సైతం వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఇక విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సీఐను పరామర్శించారు. పోలీసులపై తిరగబడిన నిందితుడు అజయ్ ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు.
