జపాన్ కరాటే వీరుడు యాంగుచి పేరును పారడీ చేస్తూ, తిలారాజన్ డ్రామా ట్రూప్‌లో నరసింహన్ కరాటే ఫైటర్‌గా, కామెడీ చేసే ఓంకుచి పాత్రలో నటించారు. ఈ నాటకం విజయం సాధించి, ఆయన పేరు ఓంకుచి నరసింహన్‌గా స్థిరపడింది. నరసింహన్ 1936లో తమిళనాడులోని కుంభకోణం నగరంలో జన్మించారు. అయితే తర్వాత సినిమాలు చేయకుండా డిగ్రీ పూర్తిచేసి ఎల్ ఐ సి లో జాబ్ కూడా సంపాదించాడు. సరస్వతి అనే అమ్మాయిని పెళ్లాడారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు,ఒక కుమారుడు జన్మించారు.
కరాటే మాస్టర్ యాంగ్ కుచి అనే వ్యక్తి పేరుని పేరడీ చేస్తూ, డ్రామా ట్రూప్ లో కరాటే చేసే ఫైటర్ గా కామెడీ సీన్ తో నరసింహన్ అలరించాడు. నాటకం పేరు ఓంకుచి. దీంతో ఈ నాటకం సక్సెస్ కావడంతో ఇతడి పేరు ఓంకుచి నరసింహన్ గా మారిపోయింది. ఆ డ్రామా ట్రూప్ లో డైరెక్టర్ శంకర్ ఇతడి కామెడీ ని హైలెట్ చేసేవాడు. 13వ యేట సినిమాలో ఎంట్రీ ఇచ్చాక 30ఏళ్ళ విరామం తర్వాత మళ్ళీ వెండితెరపై మెరిసిన నరసింహన్ కి పెద్దపెద్ద వాళ్ళ సపోర్ట్ లభించింది.

తమిళ నటుడు సురలి రాజన్, డైరెక్టర్ విసు మంచి సపోర్ట్ ఇవ్వడంతో కమెడియన్ గా తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చకుని నరసింహన్ ఆడియన్స్ ని మెప్పించాడు. డైరెక్టర్ సి రంగరాజన్, శంకర్ తదితరుల డైరెక్షన్ లో ఛాన్స్ లు దక్కించుకున్నారు. ఇక తెలుగులో ఎన్నో సినిమాలు చేసారు. పవిత్రబంధం మూవీలో ఈయన కామెడీ మరువలేనిది. మా పల్లెలో గోపాలుడు మూవీలో తలవెంట్రుకలు లేచి నిలబడే సీన్స్ , భారతీయుడులో లారీ డ్రైవర్ గా నటన,ఒకే ఒక్కడు,జెంటిల్ మేన్ వంటి సినిమాల్లో నరసింహన్ యాక్షన్ అదిరిపోతోంది.
ఎల్ ఐ సి లో ఉద్యోగం మానేసినప్పటికీ పార్ట్ టైమ్ గా పాలసీలు చేయిస్తూ,నాటకాల్లో,సినిమాల్లో నటించేవారు. గట్టిగా ఫ్యాన్ పెడితే ఎగిరిపోయి మనిషిలా ఉండే నరసింహన్ నటనలో ఉద్దండుడు. అందుకే దాదాపు 14భాషల్లోనే కాదు, ఒక ఆంగ్ల మూవీలో కూడా చేసాడు. రెండు దశాబ్దాలు నవ్వించి, నవ్వించి 2009లో గొంతు కాన్సర్ తో మరణించారు.
