మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రస్తుతం సామాన్యుడు గ్రాము బంగారం కొనాలంటేనే భయపడే రోజులు వచ్చాయి. ఇప్పుడు పది గ్రాముల బంగారం కొనాలంటేనే లక్షా 35 వేల వరకు చెల్లించుకోవాల్సిందే. అయితే 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 660 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 600 తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్‌పై 10 డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,326 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరసైతం భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.3వేలు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,23,000 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,34,180కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,23,150 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,34,330కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,23,000 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,34,180కు చేరింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.3వేలు తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,21,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,09,000 వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,21,000 వద్దకు చేరింది.
