అక్కినేని ఇంట శుభవార్త అంటూ సోషల్ మీడియాలో, టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అక్కినేని ఫ్యామిలీలోకి వారసుడు రాబోతున్నాడన్న టాక్ తెగ వైరల్ అయ్యింది. ఈమధ్య కాలంలోనే నాగచైతన్య శోభితకు, అఖిల్, జైనాబ్ కు పెళ్లయ్యింది. కాగా ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీకి వారసుడిని ఈ ఇద్దరు హీరోలలో ఒకరు ఇవ్వబోతున్నట్టు సమాచారం.
శోభిత ప్రెగ్నెంట్ అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. నాగచైతన్య తండ్రి కాబోతున్నటాడంటూ.. గుసగుసలు వినిపించాయి. అయితే అందులో నిజం లేదని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే శోభిత ఈ విషయం దాచడం కష్టమనే చెప్పాలి.

అయితే కొన్ని రోజుల క్రితం జైనబ్ రవ్జీ ప్రగ్నెంట్ అయింది, తల్లి కాబోతుందని, అఖిల్ తండ్రి కాబోతున్నాడని వార్తలు వచ్చాయి. వీటిపై అఖిల్ కానీ, అక్కినేని ఫ్యామిలీ కానీ ఎవరూ స్పందించలేదు. తాజాగా దీనిపై నాగార్జున స్పందించాడు. నాగార్జున ఓ హెల్త్ ఈవెంట్ కి వెళ్లగా అక్కడ ఓ మీడియా ప్రతినిధి..
మీరు తండ్రి నుంచి తాత గా ప్రమోట్ అవుతున్నారా అది నిజమేనా? సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అని అడిగారు. దీనికి నాగార్జున నవ్వేసి.. సరైన సమయం వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను అని సమాధానమిచ్చారు. ఆ వార్తలను ఖండించకుండా టైం వచ్చినప్పుడు చెప్తాను అనడంతో అఖిల్ నిజంగానే తండ్రి కాబోతున్నాడా అని రూమర్ మరింత బలంగా వినిపిస్తుంది.
