కన్నెగంటి బ్రహ్మానందం ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు. వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం, ఆరు సినీ మా అవార్డులు, మూడు సైమా పురస్కారాలు అందుకున్నారు. 2005 లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. కన్నెగంటి బ్రహ్మానందం రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా నటించిన ఆహనా పెళ్ళంట సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు.
అయితే దశాబ్దాలుగా సినీరంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. కానీ ఇన్ని సంవత్సరాల తన సినీప్రయాణంలో తాను సంపాదించుకున్న ఆస్తి దివంగత కమెడియన్ ఎమ్మెస్ నారాయణ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఆయన చివరి రోజుల్లో జరిగిన ఓ విషయం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఎమ్మెస్ నారాయణ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పుడు ఆఖరి రోజున తన కుమార్తెను ఎమ్మెస్ నారాయణ పిలిచి పేపర్ మీద బ్రహ్మానందం అన్నయ్యను కలవాలని ఉందని.. ఆయనను పిలిపించు అని రాశారట.

ఆ తర్వాత ఎమ్మెస్ నారాయణ కూతురు బ్రహ్మానందానికి ఫోన్ చేసి విషయం చెప్పారట. అప్పుడే ఏదో షూటింగ్ లో ఉన్న బ్రహ్మానందం పర్మిషన్ తీసుకుని మరీ ఆసుపత్రికి వచ్చారట. అప్పుడు ఆయన చేతిని పట్టుకుని ఎమ్మెస్ నారాయణ కాసేపు అలా ఉండిపోయారట. ఆ సమయంలో ఎమ్మెస్ కళ్ల నుంచి కన్నీరు అలా జారుతూ వచ్చిందట… ఆ సమయంలో అంత మంది కుటుంబ సభ్యులు ఉన్నా తనను పిలిచాడని… ఎంతో ప్రేమ, అభిమానం ఉండి ఉంటే అలా తనను అలాంటి సమయంలో పిలిచి ఉంటాడని చెబుతూ ఎమోషనల్ అయ్యారు బ్రహ్మానందం.
ఎమ్మెస్ నారాయణ మాత్రమే తాను సంపాదించుకున్న ఆస్తి అన్నారు. అప్పుడే ఏదో షూటింగ్ లో ఉన్న బ్రహ్మానందం పర్మిషన్ తీసుకుని మరీ ఆసుపత్రికి వచ్చారట. అప్పుడు ఆయన చేతిని పట్టుకుని ఎమ్మెస్ నారాయణ కాసేపు అలా ఉండిపోయారట. ఆ సమయంలో ఎమ్మెస్ కళ్ల నుంచి కన్నీరు అలా జారుతూ వచ్చిందట… ఆ సమయంలో అంత మంది కుటుంబ సభ్యులు ఉన్నా తనను పిలిచాడని… ఎంతో ప్రేమ, అభిమానం ఉండి ఉంటే అలా తనను అలాంటి సమయంలో పిలిచి ఉంటాడని చెబుతూ ఎమోషనల్ అయ్యారు బ్రహ్మానందం. ఎమ్మెస్ నారాయణ మాత్రమే తాను సంపాదించుకున్న ఆస్తి అన్నారు.
