కామనర్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ 5గా నిలిచారు డీమాన్ పవన్, కళ్యాణ్ పడాల. ఆట తీరు.. టాస్కులలో అదరగొట్టేస్తూ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక తమ ప్రవర్తన, మాట తీరుతో సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ సీరియల్ బ్యూటీ తనూజ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు టాప్ 4 కంటెస్టెంట్స్ తక్కువే అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఫినాలేకు మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో క్షణక్షణం ఓటింగ్ లెక్కలు మారిపోతున్నాయి. అయితే ఈ ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలే లో ఎవరు టైటిల్ విన్నర్ గా నిలుస్తారు? ఎవరు రన్నరప్ తో సరిపెట్టుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
గ్రాండ్ ఫినాలేకు సంబంధించి ఇప్పుడు అందరి దృష్టి ఓటింగ్ ట్రెండ్స్ మీదే ఉంది. సోషల్ మీడియా ట్రెండ్స్, అన్-ఆఫీషియల్ పోల్స్ ప్రకారం కళ్యాణ్ పడాల భారీ ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా కళ్యాణ్ క్యాంపైన్ గుంపు గుత్తగా ఓట్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ప్రస్తుతం అతనే టైటిల్ రేసులో ముందున్నాడని చెప్పవచ్చు. ఇక తనూజ అభిమానులు ఆమెను తొలి మహిళా విన్నర్ గా నిలబెట్టాలనే లక్ష్యంతో భారీగా ఓట్లు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె రెండో స్థానానికే పరిమితమైంది.
ఓటింగ్ పరంగా కల్యాణ్ కు, తనూజ మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఇక నిన్నటివరకు ఓటింగ్ లో టాప్-3లో ఉన్న ఇమ్మూ ఇప్పుడు ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయాడు. డిమాన్ పవన్ మూడో స్థానానికి ఎగబాకగా, ఆఖరి ప్లేసులో సంజనా గల్రానీ ఉంది. మెజారిటీతో ముందంజలో ఉన్నాడు. అంచనాల ప్రకారం కళ్యాణ్‌కు సుమారు 38 శాతం, తనూజకు 32 శాతం, డిమోన్ పవన్‌కు 13 శాతం, ఇమ్మానుయేల్‌కు 12 శాతం, సంజనకు5 శాతం ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి బిగ్‌బాస్ తెలుగు 9 టైటిల్ పోరు కళ్యాణ్ పడాల – తనూజ మధ్య నెక్ టు నెక్ ఫైట్‌గా మారింది.
గ్రాండ్ ఫినాలే కు ఇంకా కొంత సమయం ఉండటంతో ఓటింగ్ ట్రెండ్ మారే అవకాశమూ ఉంది. చివరి క్షణంలో ఎలాంటి ట్విస్ట్ లు చోటుచేసుకుంటాయేమో చూడాలి. ఒక వేళ ఇదే ఓటింగ్ సరళి కొనసాగితే మాత్రం కల్యాణ్ దే బిగ్ బాస్ టైటిల్ అని చెప్పవచ్చు. మని ఈసారి బిగ్‌బాస్ టైటిల్ ఎవరిని వరిస్తోందో చూడాలంటే ఆదివారం గ్రాండ్ ఫినాలే వరకు వేచి చూడాల్సిందే.
Endless masti, full-on fun mode! 😂
— Starmaa (@StarMaa) December 17, 2025
Watch #BiggBossTelugu9 UnSeen Extra Cuts Mon–Fri 11 PM on #StarMaa pic.twitter.com/HqG3BNUYdO
