దేవాలయాల్లో శివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించడం శివారాధనలో ప్రధాన భాగం. కానీ కొంతమంది భక్తులు ఇంట్లోనే శివలింగాన్ని ఉంచి పూజించాలని కోరుకుంటారు. అయితే పండితులు చెబుతున్నట్టుగా, ఇంట్లో శివలింగాన్ని ఉంచే ముందు వాస్తు నియమాలు తప్పక పాటించాలి, లేకపోతే పూజ ఫలితం రాకుండా, ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయని చెబుతున్నారు. అయితే శివలింగ ఆరాధనలో వెండికి ప్రత్యేక స్థానం ఉంది. దీనిని పూజించడం వల్ల అనేక శుభ ఫలితాలు లభిస్తాయి.
ఐశ్వర్య ప్రాప్తి.. వెండి శుక్రుడికి చంద్రుడికి ప్రతీక కావడం వలన, వెండి శివలింగాన్ని పూజించడం వల్ల ఇంట్లో సంపద శ్రేయస్సు పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, అదృష్టం కలిసి వస్తుంది. మానసిక ప్రశాంతత: వెండికి మనస్సును ప్రశాంతంగా ఉంచే అద్భుతమైన గుణం ఉంది. దీనిని పూజించడం వలన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత మరియు ప్రశాంతత పెరుగుతాయి.

ఆరోగ్యం ఉపశమనం.. నిత్యం వెండి శివలింగానికి అభిషేకం చేసి, ఆ తీర్థాన్ని స్వీకరించడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల నమ్మకం. కొన్ని ప్రత్యేక సమస్యలతో బాధపడేవారు వెండి శివలింగాన్ని ఆరాధించడం ద్వారా త్వరిత ఫలితాలను పొందవచ్చని శాస్త్రాలు సూచిస్తున్నాయి. చంద్ర దోషం ఉన్నవారు.. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు, అధిక మానసిక ఒత్తిడి, ఆందోళన లేదా నిద్రలేమితో బాధపడేవారు వెండి శివలింగాన్ని పూజిస్తే మనసు నిలకడగా ఉంటుంది చంద్ర దోషం తొలగిపోతుంది.
సంతాన సమస్యలు.. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు వెండి శివలింగానికి ప్రతి సోమవారం పంచామృత అభిషేకం చేయడం అత్యంత శుభప్రదం. ఆర్థిక ఇబ్బందులు.. అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారు, వ్యాపారంలో తరచుగా నష్టాలు వచ్చే వారు వెండి శివలింగాన్ని ఆరాధిస్తే ఆటంకాలు తొలగిపోయి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భయం, ఆందోళన.. నిరంతరం ఏదో తెలియని భయంతో లేదా ఆందోళనతో బాధపడేవారు శివుడిని వెండి రూపంలో ఆరాధిస్తే గొప్ప ధైర్యం మానసిక స్థైర్యం లభిస్తాయి.
