శుభవార్త చెప్పేసిన మెగా కోడలు, దీంతో ఉపాస‌న‌కు శుభాకాంక్ష‌ల వ‌ర్షం.

divyaamedia@gmail.com
2 Min Read

తాజాగా తాను “మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్” అనే ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే ప్రస్తుతం గర్భవతిగా ఉన్న కారణంగా ఆ అవార్డు కార్యక్రమానికి స్వయంగా హాజరుకాలేకపోయినట్లు తెలిపారు. అయినప్పటికీ.. ఈ గుర్తింపు తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. మానసికంగా, శారీరకంగా సానుకూల మార్పు తీసుకొచ్చే దిశగా తాను ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటానని ఉపాసన పేర్కొన్నారు.

ఈ అవార్డు ప్రతి రోజూ మరింత కష్టపడి పనిచేయడానికి..కొత్త సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుందని ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చారు. అవార్డుతో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌, ఉపాసన దంపతుల ఇంట మరోసారి శుభవార్త వినిపిస్తోంది. ఇటీవ‌ల ఓ వీడియో షేర్ చేయ‌గా ఇందులో దీపావళి సంబరాలతో పాటు ఉపాసనకు సీమంతం నిర్వహించిన దృశ్యాలు కూడా కనిపించడంతో ఆమె మరోసారి గర్భం దాల్చిందన్న వార్తలు బలంగా వినిపించాయి.

ముఖ్యంగా “డబుల్” అనే పదాన్ని పదే పదే వాడటంతో ఈసారి కవలలు పుట్టబోతున్నాయనే ప్రచారం జోరుగా సాగింది. అయితే అది నిజ‌మే అనే విష‌యాన్ని ఉపాస‌న కూడా క‌న్‌ఫాం చేసింది. త్వ‌ర‌లో ఉపాస‌నకి క‌వ‌ల‌లు జ‌న్మించ‌బోతున్నారు. ఇక రామ్‌చరణ్‌, ఉపాసనలకు 2012లో వివాహం కాగా… 2023 జూన్‌లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు ‘క్లీంకార’ అని నామకరణం చేశారు. ఇప్పటివరకు క్లీంకార ముఖాన్ని ఫ్యామిలీ రివీల్ చేయలేదు. తాజాగా ఉపాసన మరోసారి గర్భం దాల్చినట్లు హింట్ ఇవ్వడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఈసారి ‘సింబా’ వస్తాడంటూ కొందరు కామెంట్లు చేసారు. కాగా గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక కార్యక్రమంలో తనకు మనవడు పుట్టాలని కోరికగా ఉందని చెప్పిన విషయం తెలిసిందే. ఇక గతంలో ఉపాసన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రెండో సంతానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మొదటి బిడ్డ విషయంలో చాలా ఆలస్యం చేశాం. అప్పట్లో వచ్చిన విమర్శలు, ఒత్తిడిని పట్టించుకోలేదు. కానీ రెండో బిడ్డ విషయంలో అలా చేయాలనుకోవడం లేదు అని చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం ఉపాస‌న ప్ర‌గ్నెంట్ కాగా, వ‌చ్చే ఏడాది క‌వ‌ల‌ల‌కి జ‌న్మ‌నివ్వ‌నుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *