పెళ్లి పీటలెక్కనున్న తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, అసలు విషయమేంటో తెలిస్తే..?

divyaamedia@gmail.com
3 Min Read

తరుణ్ భాస్కర్ ప్రస్తుతం ఈషా రెబ్బాతో కలిసి ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే మలయాళ రీమేక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరిద్దరి మధ్య ప్రేమగా చిగురించిందని సినీ వర్గాల టాక్. వరంగల్‌ ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరి మధ్య ప్రాంతీయ బంధం కూడా వీరిని మరింత దగ్గర చేసిందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం తెలుగులో ఆమె ఓం శాంతి శాంతి శాంతిః అనే చిత్రంలో నటిస్తోంది. ఇది ఓ మలయాళ మూవీకి రీమేక్‌. ఇందులో దర్శకుడు, నటుడు తరుణ్‌ భాస్కర్‌కి జోడిగా చేస్తోంది ఈషా. దీనికి సంబంధించిన అప్‌ డేట్‌ ఆ మధ్యనే వచ్చింది.

ఫస్ట్ లుక్‌, టీజర్‌లు వచ్చాయి. ఇందులో ఈషా రెబ్బా, తరుణ్‌ భాస్కర్‌ ఫోటో ఆకట్టుకుంది. ఈ ఇద్దరు జంటగా కనిపించారు. సినిమాలో వీరిద్దరు భార్యాభర్తలుగా నటిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల వీరిద్దరు తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇదిలా ఉంటే ఈషా రెబ్బా, తరుణ్‌ భాస్కర్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తెగ వైరల్‌ అవుతుంది. ఈషారెబ్బా, తరుణ్‌ భాస్కర్‌ ప్రేమలో ఉన్నారనే వార్త హాట్‌ టాపిక్‌గా మారింది. అంతేకాదు త్వరలో ఈ ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారట.

ఓం శాంతి శాంతి శాంతిః చిత్ర షూటింగ్‌లో ఈ ఇద్దరు కలిశారు. ఈ షూటింగ్‌ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారని సమాచారం. ఆ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లబోతున్నారట. వచ్చే ఏడాది మ్యారేజ్‌ కి ప్లాన్‌ చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ ఇద్దరు వరంగల్‌కి చెందిన వారే కావడం విశేషం. ఇది కూడా వీరి మధ్య ప్రేమ మరింత బలపడటానికి కారణమని టాక్‌. ఇటీవల ఎటు వెళ్లినా ఈ ఇద్దరు కలిసే వెళ్తున్నారు. పార్టీలు, ఫంక్షన్లలోనూ ఇద్దరు కలిసే పాల్గొంటున్నారు. రూమర్లకి మరింత బలం చేకూరిందని చెప్పొచ్చు. తరుణ్‌ సన్నిహిత వర్గాలు కూడా ఈ ప్రేమ మ్యాటర్‌ నిజమే అని అంటున్నాయి.

కాకపోతే అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం లేదు. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి సక్సెస్‌ ఈవెంట్‌లో యాంకర్‌ మీరు చూసిన గొప్ప ప్రేమ కథ ఏంటని ప్రశ్నించింది. దానికి భాస్కర్‌ స్పందిస్తూ, నాదే, నా లైఫ్‌లోనే చూస్తున్నా, సాగుతా ఉంది అని పేర్కొన్నాడు. దీనికి యాంకర్‌ స్పందిస్తూ నాకు పేరు తెలుసు, కానీ చెప్పను అని వెల్లడించడం విశేషం. ఇక తరుణ్‌ భాస్కర్‌కి ఇప్పటికే పెళ్లి అయ్యింది. కానీ ఆమెతో విడాకులు తీసుకున్నారు. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థాల కారణంగా విడిపోయినట్టు సమాచారం.

కాకపోతే విడాకులకు సంబంధించిన వార్తని తరుణ్‌ అధికారికంగా ప్రకటించలేదు. చాలా కాలంగా ఒంటరిగానే ఉంటున్నా ఆయన ఈషా రెబ్బా ప్రేమలో పడ్డారని సమాచారం. ఇక తరుణ్‌ భాస్కర్‌ పెళ్లిచూపులు చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ మూవీ మంచి హిట్‌ అయ్యింది. విజయ్‌కి మంచి బ్రేక్‌ వచ్చింది. ఈసినిమాతోనే ఇటు తరుణ్‌ భాస్కర్‌, అటు విజయ్‌, మరోవైపు ప్రియదర్శి, ఇలా చాలా మంది లైఫ్‌ టర్న్ తీసుకుంది. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది, పిట్టకథలు, కీడా కోలా వంటి చిత్రాలను రూపొందించారు తరుణ్‌.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *