నిన్న అంతా ఎక్స్‌పెక్ట్ చేసినట్లుగానే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆదివారం ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే భరణి ఎలిమినేట్ కానున్నారని SMలో పోస్టులు వైరలవుతున్నాయి. అదే జరిగితే కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజన టాప్-5కి చేరుకుంటారు. అయితే హౌస్ నుంచి భరణి ఎలిమినేట్ అవ్వడంతో తనూజ షాక్ అయ్యింది.
హౌస్ లో నాన్న, నాన్న అంటూ భరణి చుట్టూ తిరిగిన తనూజ.. భరణి ఎలిమినేట్ అనగానే అతని కాళ్లమీద పడిపోయింది. ఇక ఇమ్మాన్యుయేల్ ఆనందంతో చప్పట్లు కొట్టాడు. నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించండి.. నేనూ టాప్ 5లో ఉండాలని కోరుకున్నాను. బట్ మీరు టాప్ 5కి అర్హులే. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అని బయటకు వచ్చేశాడు. కాళ్లమీద పడ్డ తనుజను ఆశీర్వదించాడు భరణి.. మీరు అనుకున్నది సాధించే వస్తాను బయటకి.

మీకు, మా నాన్నకి అదే చెప్తున్నా అని ఎమోషనల్ అయ్యింది తనూజ. ఇక హౌస్ నుంచి స్టేజ్ పైకి వచ్చిన భరణికి తన జర్నీని చూపించారు నాగ్. ఆ జర్నీ వీడియోలో తనూజ, దివ్య, సుమన్ శెట్టి తప్ప ఎవ్వరూ లేరు. ఆతర్వాత ఒకొక్కరి గురించి చెప్పాడు భరణి. ఇమ్మానుయేల్ తో నాలుగు వారాలు బాగానే ఉన్నాను.. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది కానీ.. అతనిపై నాకు ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పాడు భరణి, కళ్యాణ్ పడాల.. కప్ కొట్టే సామర్థ్యం ఉంది.
ఆల్ ది బెస్ట్ అన్నాడు భరణి. సంజనా గారు కూడా.. ఫైటింగ్ స్పిరిట్ ఉంది కాబట్టే అక్కడున్నారు. డెమాన్ పవన్.. చాలా స్ట్రాంగ్. అతని డ్రీమ్స్ తీరాలని కోరుకుంటున్నా.. అని చెప్పుకొచ్చాడు భరణి. తనూజా నీ ఫ్యూచర్ బాగుండాలి. నీ పెళ్లికి నన్ను పిలు. తప్పకుండా వస్తాను. నువ్వు ట్రోఫీ ఎత్తాలి అని తెలిపాడు. ఇక ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. మరి ఎవరు విన్నర్ అవుతారో చూడాలి.
