జాన్వీ కపూర్ లగ్జరీ హౌస్ చుస్తే.. ఇది ఇల్లా లేక ఇంద్రభవనమా.. అని అంటారు, వైరల్ వీడియో.

divyaamedia@gmail.com
2 Min Read

నటిగా తనను తాను నిరూపించుకున్న ఈ బ్యూటీ.. పాన్ ఇండియా హీరోయిన్ గా మారాలని ప్లాన్ వేస్తోంది. వేల కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్ ను ఏంజాయ్ చేస్తూనే.. ఇండస్ట్రీలో స్టార్ డమ్ కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. అయితే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ సిస్టర్స్ జాన్వీ , ఖుషీ కపూర్ లగ్జరీ ఇల్లు హాట్ టాపిక్‌గా మారింది.

అక్షరాలా రూ.65 కోట్ల విలువైన ఈ ఇల్లు కేవలం ఓ అపార్ట్‌మెంట్ మాత్రమే కాదు.. అదొక అద్భుతమైన కళాఖండాల ప్రపంచం, కుటుంబ జ్ఞాపకాలకు నిలయం. ఫరా ఖాన్ వ్లాగ్‌లో ప్యాలెస్..రీసెంట్‌గా ఫిల్మ్‌మేకర్ ఫరా ఖాన్, తన యూట్యూబ్ వ్లాగ్ ద్వారా ఈ లగ్జరీ ఇంటిని ప్రపంచానికి పరిచయం చేసింది. 25 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్న తన ఛానెల్‌లో, కపూర్ సిస్టర్స్‌తో పాటు వాళ్ల నాన్న, నిర్మాత బోనీ కపూర్ నివసించే ఈ ఇంటి స్పెషాలిటీస్ చూపించింది.

ఈ వ్లాగ్ చూస్తే.. ఈ ఇల్లు ఎంత గ్రాండ్‌గా ఉంటుందో, అదే సమయంలో ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ టచ్ ఎంతలా ఉందో అర్థమవుతుంది. ముంబైలోని కాస్ట్లీ ఏరియా పాలి హిల్‌లో ఉన్న ఈ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్, 8,669 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ఇంట్లో మెయిన్ అట్రాక్షన్ భారీ గాజు కిటికీలు అని చెప్పుకోవచ్చు. వీటివల్ల ఇల్లంతా నేచురల్ లైటింగ్‌తో నిండిపోయి, బయటి బ్యూటిఫుల్ వ్యూస్ కనువిందు చేస్తాయి.

వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. రెండు ఫ్లోర్స్‌ను కలుపుతూ మధ్యలో ఉన్న మెట్ల మార్గం ఇంటికి రాయల్ లుక్‌ను తెచ్చిపెట్టింది. ఈ ఇంట్లోకి అడుగుపెడితే ఏదో ప్రైవేట్ మ్యూజియంలోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడి ఇంటీరియర్ అంతా స్పెషల్‌గా డిజైన్ చేయించిన ఫర్నిచర్, యూనిక్ ఆర్టిఫ్యాక్ట్స్, ఆర్ట్‌వర్క్‌లతో నిండి ఉంటుంది. కొన్ని గోడలపై అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్స్ ఉంటే, మరికొన్ని గోడలు వాళ్ల ఫ్యామిలీ మెమొరీస్‌కు అద్దం పడతాయి.

ముఖ్యంగా, దివంగత నటి, వాళ్ల అమ్మ శ్రీదేవికి సంబంధించిన జ్ఞాపకాలకు ఓ స్పెషల్ కార్నర్ కేటాయించారు. వుడెన్ ఫ్లోరింగ్, స్టైలిష్ లైట్లతో కూడిన లివింగ్, బార్ ఏరియా సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. దీనికి ఆనుకుని పచ్చని మొక్కలతో ఓ బాల్కనీ కూడా ఉంది. ఓ గోడకు ఉన్న పెద్ద అద్దం, ఆ ప్రదేశాన్ని మరింత విశాలంగా కనిపించేలా చేస్తుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *