బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్ లో ఓ కొత్త ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే కాంబినేషన్లో ‘సింహా’, లెజెండ్‘అఖండ’వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. అన్నీ కూడా ఒక దాన్ని మించి మరొకటి అన్నట్టు హిట్ అయ్యాయి.అయితే నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ అఖండ 2పై విడుదలకు ముందే భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం సాధించిన ఘన విజయం తర్వాత, ఈ సీక్వెల్‌పై అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూశారు.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన బీజీఎమ్ సినిమాకు మరింత పవర్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాలో మరో ముఖ్యమైన అంశం బాలకృష్ణ కూతురు పాత్ర. ఆ పాత్రలో నటించిన అమ్మాయి ప్రేక్షకుల దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది. ఆమె పేరు హర్షాలీ మల్హోత్రా. అఖండ 2లో ఆమె జనని అనే పాత్రలో కనిపిస్తుంది. ఈ పాత్ర చుట్టూనే సినిమా కథ ముఖ్యంగా సాగుతుంది.

జనని ఎదుర్కొనే ప్రమాదాలు, వాటి నుంచి ఆమెను కాపాడేందుకు తండ్రిగా బాలయ్య చేసే పోరాటం కథకు ప్రధాన బలం. హర్షాలీ మల్హోత్రా అసలు పరిచయం లేని అమ్మాయి కాదు. చిన్న వయసులోనే ఆమె బాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించింది. సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ సినిమా భజరంగీ భాయిజాన్‌లో మున్ని అనే పాత్రలో నటించి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఆ సినిమా విడుదలైనప్పుడు ఆమె వయసు కేవలం 6 సంవత్సరాలే.

మాటలు లేకుండా కేవలం హావభావాలతోనే భావోద్వేగాలను పండించడం ఆమెకు ప్రత్యేకతగా నిలిచింది. భజరంగీ భాయిజాన్ తర్వాత హర్షాలీ పలు హిందీ టీవీ సీరియల్స్‌లో కూడా నటించింది. కుబూల్ హై, లౌట్ ఆవో త్రిష వంటి సీరియల్స్ ద్వారా టెలివిజన్ ప్రేక్షకులకు దగ్గరైంది. చిన్న వయసులోనే నటనలో మంచి అనుభవం సంపాదించిన హర్షాలీ, ఇప్పుడు టీనేజ్ దశలోకి వచ్చి సినిమాల్లో కొత్త రకమైన పాత్రలు చేయడానికి సిద్ధమైంది.
