ఈ 3 టాబ్లెట్లు మీ దగ్గర ఉంటే చాలు, హార్ట్ ఎటాక్ ఎప్పుడు వచ్చిన ప్రాణాలు కాపాడుకోవచ్చు.

divyaamedia@gmail.com
2 Min Read

గుండెపోటు అనేది గుండె కండరాలకు రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు వచ్చే తీవ్రమైన పరిస్థితి. ఇది గుండెలోని రక్తనాళాలు అడ్డుపడటం వల్ల జరుగుతుంది, దీనివల్ల గుండెకు ఆక్సిజన్ అందదు. ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, వికారం, మరియు తీవ్రమైన చెమటలు దీని ప్రధాన లక్షణాలు. అయితే ప్రస్తుతం మన లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లు మారిపోవడం వల్ల చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ కేసులు పెరిగిపోతున్నాయి.

దీనికి తోడు ఒక్కోసారి ఎటువంటి వార్నింగ్ సైన్స్ లేకుండానే గుండె నొప్పి వస్తుంది. అందుకే, సడెన్‌గా ఎవరికైనా హార్ట్ ఎటాక్ వస్తే.. ఏ మెడిసిన్స్ ఇవ్వాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎటాక్ వచ్చిన మొదటి 30 నిమిషాలు (గోల్డెన్ పీరియడ్) చాలా కీలకం. ఈ టైమ్‌లో కొన్ని లైఫ్ సేవింగ్ మెడికేషన్స్ వాడితే ప్రాణ నష్టం నుంచి బయటపడొచ్చు. హార్ట్ మజిల్ డ్యామేజ్ కూడా తగ్గుతుంది.

ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో గానీ, ఆఫీస్‌లో గానీ ఒక ఎమర్జెన్సీ హార్ట్ ఎటాక్ కిట్ రెడీగా ఉంచుకోవాలి. ఈ కిట్‌లో కచ్చితంగా ఉండాల్సిన మూడు లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఇవే.. డిస్పిరిన్ 325 mg (Dispirin 325 mg): ఇది రక్తం గడ్డకట్టకుండా చూసే మందు. క్లోపిడోగ్రెల్ 75 mg (Clopidogrel 75 mg): ఇది యాంటీ-ప్లేట్‌లెట్ మెడిసిన్. అటోర్వాస్టాటిన్ 40 mg (Atorvastatin 40 mg): ఇది గుండె ధమనుల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించి సమస్య మరింత తీవ్రం కాకుండా కాపాడుతుంది.

అయితే, ఈ మందులు హాస్పిటల్ ట్రీట్‌మెంట్‌కు రీప్లేస్‌మెంట్ కావు. కేవలం ఆంబులెన్స్ వచ్చేంతవరకు ప్రాణాలను కాపాడే ఉపశమన చర్యలు మాత్రమే. వెంటనే ఎలా గుర్తించాలి.. హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తికి ఏయే లక్షణాలు కనిపిస్తే ఈ మెడిసిన్స్ ఇవ్వాలి? డాక్టర్ చెప్పిన వివరాల ప్రకారం, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి.. ఛాతీలో ఒక్కసారిగా నొప్పి. దానితో పాటు దవడ, ఎడమ చేయి, పై వీపు భాగం నుంచి నొప్పి మొదలవడం.

ఎక్కువగా చెమట పట్టడం. వికారం ఫీలింగ్.ఊపిరి అందకపోవడం. ఈ లక్షణాలు కనిపిస్తే, మందులు వెంటనే ఇవ్వాలి. డాక్టర్ సూచించిన విధంగా డిస్పిరిన్ టాబ్లెట్‌ను క్లోపిడోగ్రెల్, అటోర్వాస్టాటిన్ టాబ్లెట్స్‌తో కలిపి పేషెంట్‌కు వెంటనే అందించాలి. ప్రథమ చికిత్స ఇదే.. ఒకవేళ మీ పక్కన ఎవరికైనా హార్ట్ ఎటాక్ లక్షణాలు కనిపిస్తే మెడిసిన్స్ ఇచ్చే ముందు గానీ, ఇచ్చిన తరువాత గానీ కింద సూచించిన చర్యలు తీసుకోవాలి: ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ (108 లాంటి నంబర్లు)కి కాల్ చేయాలి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *