బిగ్ బాస్ 9’ నుండి సుమన్ శెట్టి అవుట్. బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారో తెలిస్తే..?

divyaamedia@gmail.com
2 Min Read

ఫినాలే వీక్‌లో కేవలం మేకోవర్స్, ఓటు అప్పీల్స్ మాత్రమే ఉంటాయి. వచ్చే ఆదివారం నాటితో బిగ్ బాస్ సీజన్ 9కి ఎండ్ కార్డ్ పడబోతుండగా.. కీలకమైన 14వ వారం ఎలిమినేషన్ కీలకంగా మారింది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. సుమన్ శెట్టి, ఇమ్మానుయేల్, తనూజ, సంజన, డెమాన్ పవన్, భరణి, కళ్యాణ్ పడాల.. అయితే మొదటి వారం లో ఎలిమినేట్ అయిన శ్రేష్టి వర్మ కూడా సుమన్ శెట్టి కంటే బెటర్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు.

కానీ ఇన్ని రోజులు ఆయన హౌస్ లో కొనసాగడానికి ముఖ్య కారణం మంచోడు, అమాయకత్వం ఉన్న మనిషి, మిగిలిన కంటెస్టెంట్స్ లాగా కన్నింగ్ ఆలోచనలు లేని మనిషి కాబట్టే ఇన్ని రోజులు హౌస్ లో ఆడియన్స్ అతనికి ఓట్లు వేస్తూ వచ్చారు. అంతే కాకుండా ఇమ్మానుయేల్ 11 వారాలు నామినేషన్స్ లో లేకపోవడం కూడా సుమన్ శెట్టి కి బాగా కలిసొచ్చింది. ఆయన ఓటింగ్ అత్యధిక శాతం ఈయనకే పడుతూ వచ్చింది. గత వారమే ఈయన ఎలిమినేట్ అవ్వాల్సింది.

కానీ కొన్ని సడన్ గా ప్లాన్ మార్చి రీతూ చౌదరి ని ఎలిమినేట్ చేశారు. ఇది సుమన్ శెట్టి కి కూడా బాగా నెగిటివి అయ్యింది. టాప్ 5 లోకి ఎంట్రీ ఇవ్వడానికి అన్ని విధాలుగా అర్హతలు ఉన్న రీతూ చౌదరి ని కాదని, సుమన్ శెట్టి ని హౌస్ లో ఎలా కొనసాగిస్తారు?, ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున నెటిజెన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఎట్టకేలకు ఆయన ఈరోజు ఎలిమినేట్ అవ్వబోతున్నాడు.

ఇతనితో భరణి, సంజన లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 14 వారాలు హౌస్ లో కొనసాగాడు కాబట్టి 44 లక్షల రూపాయలకు పైగా ఆయన రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. యాంకర్ రవి తర్వాత బిగ్ బాస్ హిస్టరీ లో ఆ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకున్న ఏకైక కంటెస్టెంట్ సుమన్ శెట్టి మాత్రమే.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *