సినీ హీరోలు, హీరోయిన్లతో కలిసి పూజలు చేయడం, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా వేణు స్వామి ఒక్కసారిగా సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా మారిపోయారు. ఆయనతో పూజలు చేయించుకున్న కొంతమంది సెలబ్రిటీలు స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారని ప్రచారం కూడా ఉంది.
అయితే టాలీవుడ్ నటి ప్రగతి పవర్‌లిఫ్టింగ్‌లో సాధించిన పతకాల వెనుక తన పూజలే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నటి ప్రగతి ఇటీవల టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ & మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని ఏకంగా నాలుగు పతకాలు సాధించారు. దేశం గర్వించేలా విజయం సాధించిన ఆమెపై సినీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు.
అయితే ఈ విజయంపై వేణు స్వామి ఆసక్తికరంగా స్పందించారు. “నటి ప్రగతి వెయిట్ లిఫ్టింగ్‌లో గెలవాలని కోరుకుంటూ నా వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఆ పూజల ఫలితంగానే ఆమె పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి నాలుగు పతకాలు సాధించగలిగారు” అని వేణు స్వామి తెలిపారు.
తన వాదనకు బలం చేకూరుస్తూ, ప్రగతి పూజల్లో పాల్గొన్నట్టుగా ఉన్న ఒక వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నటి ప్రగతి వెయిట్ లిఫ్టింగ్‌లో సాధించిన నాలుగు మెడల్స్ తాను చేసిన ప్రత్యేక పూజలు కారణంగా వచ్చాయి
— UttarandhraNow (@UttarandhraNow) December 13, 2025
– వేణు స్వామి #Venuswamy #Pragathi #UANow pic.twitter.com/COsUMRCxot
