Gold price: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్, భారీగా దిగొచ్చిన పసిడి ధరలు.
Gold price: బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు నాణ్యతను గుర్తుంచుకోవాలి. వినియోగదారులు హాల్‌మార్క్ గుర్తును చూసిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలి. హాల్‌మార్క్ అనేది బంగారంపై ప్రభుత్వ హామీ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్‌ని నిర్ణయిస్తుంది. హాల్‌మార్కింగ్ స్కీమ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్, నియమ, నిబంధనల ప్రకారం పనిచేస్తుంది. అయితే బంగారం ధరలో ప్రతీ రోజూ హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓరోజు పెరిగితే, మరో రోజు తగ్గుతున్నాయి.
Also Read: ఏ బ్యాంక్ నుంచైనా లోన్ తీసుకొని EMI కట్టలేని వారికి గుడ్ న్యూస్.
సోమవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. ఆదివారం ఉదయంతో పోల్చితే ఈరోజు తులంపై సుమారు రూ. 100 వరకు తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,300కి చేరువైంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,180 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా ఆర్థిక రాజధాని ముంబయి విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,940కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,300 వద్ద కొనసాగుతోంది.
ఇక చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,940, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,300 వద్ద కొనసాగుతోంది. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,940కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,300 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,940కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,300 వద్ద కొనసాగుతోంది.
Also Read: రెండు నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్.
ఇక విజయవాడతో పాటు, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వెండి కూడా బంగారం బాటలోనే పయణిస్తోంది. సోమవారం కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో ఢిల్లీతోపాటు ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 87,900గా ఉండగా.. చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో అత్యధికంగా రూ. 92,900 వద్ద కొనసాగుతోంది.