సౌతాఫ్రికా సిరీస్ 1-1తో సమం కావడంతో భారత్ త్వరగా తమ ఆటను మెరుగుపరుచుకుని, ధర్మశాలలో జరిగే తదుపరి మ్యాచ్‌లో పుంజుకోవాలని చూస్తోంది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారత జట్టు మేనేజ్మెంట్, టీ20 ప్రపంచ కప్ 2026 కోసం తమ సన్నాహాలను ట్రాక్‌లో ఉంచడానికి జట్టులోని లోపాలను త్వరగా సరిదిద్దుకోవాలని భావిస్తోంది.
అయితే సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో ఈ సిరీస్ ఇప్పుడు హోరాహోరీగా మారింది. అయితే ఈ ఓటమి మరో వివాదానికి కూడా తెర తీసింది. అది కోచ్ గౌతమ్ గంభీర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మధ్య జరిగిన డ్రెస్సింగ్ రూమ్ ఎక్స్ఛేంజ్. మ్యాచ్ ఓటమి తర్వాత భారత డ్రెస్సింగ్ రూమ్ లోపలి నుంచి తీసిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో కోచ్ గంభీర్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో తీవ్రంగా మాట్లాడుతున్నట్లుగా కనిపించింది. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఆడియో స్పష్టంగా లేదు, కాబట్టి వారిద్దరి మధ్య సంభాషణ ఏమిటో చెప్పడం కష్టం. అయితే వారిద్దరి బాడీ లాంగ్వేజ్ మాత్రం చాలా తీవ్రంగా, ఉద్రిక్తంగా ఉంది.
ఈ దృశ్యాలే ఆన్లైన్లో ఏం జరిగింది? అనే పూర్తిస్థాయి విశ్లేషణకు, ఊహాగానాలకు దారి తీశాయి.
Heated conversation between Hardik and Gambhir 👀pic.twitter.com/VtISwnS2FN
— Amar💫 (@KUNGFU_PANDYA_0) December 12, 2025
