పురాతన పద్దతులను ఉపయోగించి ఒక బంగారు కడ్డీని తయారు చేస్తారు. సినిమాలో అలా చూపించారు గానీ.. నిజంగా వేమన బంగారాన్ని సృష్టించాడా లేదా అన్న దానికి నేటికీ రుజువులు లేవు. అయితే న్యూక్లియర్ ట్రాన్స్మ్యుటేషన్బిస్మత్, సీసం లేదా మెర్క్యురీ వంటి భారీ మూలకాలను మోడర్న్ ఫిజిక్స్ బంగారంగా మార్చగలదని నిపుణులు చెబుతున్నారు. అధిక శక్తి కలిగిన కణ కిరణాలతో న్యూట్రాన్లు, ప్రొటాన్లను విడగొట్టడం వల్ల దీనిని సాధ్యం చేయొచ్చు.
1980ల నుంచి రీసెంట్గా చేసిన ALICE ప్రయోగం వరకు.. సీసం నుంచి బంగారు కేంద్రకాలను ఉత్పత్తి చేయొచ్చని తేలింది. అయితే, ఈ విధానంలో ప్రొడ్యూస్ అయిన బంగారం పరిమాణం పికోగ్రామ్ (గ్రాములో 12వ వంతు) మాత్రమే. పైగా, మైనింగ్ కంటే ఇది ఖరీదైన వ్యవహారమని సైంటిఫిక్ అమెరికన్ నివేదిక వెల్లడించింది. ఫ్యూజన్ లేదా ఫిజన్ఫ్యూజన్ లేదా ఫిజన్ విధానంలో పాదరసం నుంచి బంగారాన్ని తయారు చేయొచ్చు. పాదరసంలోని ఐసోటోపులను న్యూట్రాన్లతో పేల్చడం వల్ల స్థిరమైన బంగారం అయిన గోల్డ్ 197 ఏర్పడుతుంది. అయితే, ఈ ప్రాసెస్‌కి భారీగా ఎనర్జీ, ఖరీదైన ఎక్విప్మెంట్ అవసరం పడటంతో బంగారం విలువ తగ్గిపోతుంది.

ఎలక్ట్రోమ్యాగ్నటిక్ డిసోసియేషన్విద్యుత్ అయస్కాంత విచ్ఛేదనం ద్వారా సీసం నుంచి బంగారాన్ని తీయొచ్చని 2025 CERN ప్రయోగం చెబుతోంది. అల్ట్రా పెరిఫెరల్ ఘర్షణల్లో సీసం కేంద్రకాలు బంగారంగా మారుతున్నట్లు వెల్లడించింది. తీవ్రమైన విద్యుత్ అయస్కాంత క్షేత్రాలు లెడ్ 208 నుంచి మూడు ప్రోటాన్లను బయటకు పంపించి గోల్డ్- 203 కేంద్రకాలను ఏర్పరుస్తాయి. ఈ ఉత్పత్తి సెకనుకు 89 వేల బంగారు కేంద్రకాల గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది.
అయితే, ఈ ప్రయోగం ద్వారా ఇన్నేళ్లలో సేకరించిన బంగారం 29 పికోగ్రాములు మాత్రమే. దీనికి డబ్బు ఖర్చే తప్ప పెద్ద ప్రయోజనం లేదు. బంగారాన్ని పోలిన లోహాలతో..బంగారం లాంటి పదార్థాలను తయారు చేయడం సులభం. ఐరన్ పైరైట్ అనేది సహజంగా లభించే ఐరన్ సల్ఫైడ్. ఇది ప్రకాశవంతమైన ఇత్తడి రంగుతో ఉండటంతో దీన్ని బంగారంగా భావిస్తుంటారు. రాగి- జింక్ ఇత్తడి, ఇతర బంగారు రంగు మిశ్రమ లోహాలతో గోల్డ్ లాంటి మెటల్ని తయారు చేయొచ్చు.

అయితే, బంగారు మూలకంతో పోలిస్తే వీటి లక్షణాలు విభిన్నంగా ఉంటాయి. బంగారం రూపాన్ని ఇవి ఫాలో అవుతాయే తప్ప ఆ లోహాన్ని ఇవి రీప్లేస్ చేయలేవు. ల్యాబ్ గోల్డ్ప్రయోగశాలల్లో న్యూక్లియర్ ట్రాన్స్‌మ్యుటేషన్, ఫ్యూజన్ వంటి ఖరీదైన విధానాలతో ల్యాబ్ గోల్డ్‌ని తయారు చేయొచ్చు. కానీ, వీటిని వాడటం కోసం లేదా అమ్మడం కోసం తయారు చేయాలని భావించడం నష్టాన్ని మిగల్చొచ్చు.
