పెళ్లి చేసుకోవడానికి సరైన వయసు ఎంతో తెలుసా..? ఆ వయసు దాటితే..?

divyaamedia@gmail.com
1 Min Read

సాధారణంగా బంధువులు, సమాజం, కుటుంబం నుంచి వచ్చే ఒత్తిళ్లతో పెళ్లి నిర్ణయాలు ప్రభావితం అవుతుంటాయి. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనేది, ఒకరి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడాలే తప్ప, సమాజంపై కాదు. అయితే వివాహం చేసుకోవడానికి సరైన సమయం అనేది వ్యక్తిగత నిర్ణయం అని నిపుణులు చెబుతున్నారు. నేటి ప్రపంచంలో, వివాహం అనే ఆలోచనలో మనం చాలా మార్పులను చూస్తున్నాము.

పురుషులు, మహిళలు పెళ్లి చేసుకునే ముందు వారి కెరీర్ లక్ష్యాలను సాధించడం, వారి అభిరుచులను అనుసరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. విజయవంతమైన వివాహం బలమైన పునాదిపై ఆధారపడి ఉంటుంది. పెళ్లి చేసుకోబోయే ఇద్దరు భవిష్యత్తు గురించి ఒకే విధమైన అవగాహన కలిగి ఉండాలి అలా ఉంటేనే వారి వివాహ జీవితం సజావుగా సాగుతుంది.

పెళ్లి చేసుకోవడానికి సరైన వయస్సు ఏదనేది గత కొంత కాలంగా చర్చనీయాంశంగా మారిన అంశం. ప్రస్తుత రోజుల్లో పెళ్లి వయస్సు అనేది సాంస్కృతిక, సామాజిక-ఆర్థిక అంశాలచే ప్రభావితమవుతుంది. మన తాతల కాలంలో ప్రజలు చిన్న వయస్సులోనే వివాహం చేసుకునేవారు. అప్పుడు ఎవరూ డబ్బు, హోదాను చూసేవారు కాదు. కానీ ప్రస్తుత సమాజం అలా లేదు. దానికి పూర్తి విరుద్దంగా మారిపోయింది.

ఇప్పుడు డబ్బు, ఉద్యోగం, ఆస్తులు ఉంటేనే వివాహానికి ముందుకు వస్తున్నారు. వివాహానికి ‘పరిపూర్ణ వయస్సు’ అనేది కేవలం ఒక భావన. వివాహం చేసుకోవడానికి సరైన సమయం వ్యక్తిగత పరిస్థితులు, సాంస్కృతిక నేపథ్యాన్ని బట్టి మారుతుంది. బయటి వారి అంచనాల కంటే, వారు పెళ్లికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే దాని ఆధారంగా ప్రజలు నిర్ణయాలు తీసుకోవాలి. భాగస్వాములు తమ జీవిత లక్ష్యాలలో స్థిరంగా ఉంటేనే వివాహం జరగాలని జాట్‌లు అంటున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *