ఆత్మహత్యకు ప్రయత్నించిన నటి పావలా శ్యామల.. చివరకు ఏం జరిగిందంటే..?

divyaamedia@gmail.com
2 Min Read

కొంతకాలంగా పావలా శ్యామల, ఆమె కుమార్తె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనికితోడు సినిమా అవకాశాలు లేకపోవడంతో వారి పరిస్థితి దుర్భరంగా మారింది. ఈ క్రమంలో కొందరు వారిని ఓ హోమ్‌లో చేర్పించగా, అక్కడ వారి ఆరోగ్యం మరింత క్షీణించి మంచానికే పరిమితమయ్యారు. సరైన సేవలు అందించలేమంటూ ఆ హోమ్ నిర్వాహకులు వారిని బయటకు పంపించేశారు.

అయితే వృద్ధాప్య సమస్యలు, తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో శ్యామల జీవితం అస్యవ్యస్తంగా మారింది. నటితో పాటు ఆమె కూతురు కూడా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడం అందరినీ కలచివేస్తోంది. గతంలో చాలా మంది సినీ ప్రముఖులు శ్యామలకు ఆర్థిక సాయం అందజేశారు. కానీ ఆ డబ్బులు వారి మందులు, ఇతర అవసరాలకే సరిపోయాయి. ఈ క్రమంలో కొందరు వారిని ఓ హోమ్‌లో చేర్పించగా, అక్కడ వారి ఆరోగ్యం మరింత క్షీణించింది.

ఇద్దరూ మంచానికే పరిమితమయ్యారు. దీంతో ఇక శ్యామలకు సేవలు అందించలేమంటూ ఆ హోమ్ నిర్వాహకులు తల్లీకూతుళ్లను బయటకు పంపించేశారు. దిక్కుతోచని స్థితిలో రోడ్డుపైకి చేరిన శ్యామల ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారిని కార్ఖానా పోలీస్ స్టేషన్ సిబ్బంది వారిని గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని తిరుమలగిరి ఏసీపీ రమేశ్ దృష్టికి తీసుకెళ్లారు.

తక్షణమే స్పందించిన ఏసీపీ, వారిని కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ హెల్త్‌కేర్ సెంటర్‌కు తరలించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రామకృష్ణ వారికి ఆశ్రయం కల్పించి, అవసరమైన అన్ని సేవలు అందిస్తామని భరోసా ఇచ్చారు. తమ ఫౌండేషన్ ద్వారా అనాథ వృద్ధులకు సాయం అందిస్తున్నామని, ఏదైనా సాయం కావాలంటే తమను సంప్రదించాలని (9866491506) ఆయన కోరారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *