బిగ్‌బాస్‌లో బిగ్ ట్విస్ట్. కల్యాణ్ అసలు ఆర్మీ జవానే కాదు. షాకింగ్ వీడియో బయటపెట్టిన సైనికుడు.

divyaamedia@gmail.com
2 Min Read

ఎవడైనా బిగ్ బాస్ హౌస్‌లో జై జవాన్ అన్నా జై కిసాన్ అన్నా పల్లవి ప్రశాంత్‌ని గుర్తు చేసుకుని మరీ తిడుతుంటారు. అయితే సీజన్ 9లో మళ్లీ జై జవాన్ అంటూ సామాన్యుడిగా హౌస్‌లోకి వెళ్లిన కళ్యాణ్ పడాల .. ఇప్పుడు టైటిల్ రేస్‌లో ముందున్నాడు. అయితే టాప్-5 సంగతి పక్కన పెడితే టైటిల్ రేసు మాత్రం తనూజ, పవన్ కల్యాణ్ పడాల మధ్యనే ఉంది. వీరిలో ఎవరో ఒకరు ఈ సీజన్ విన్నర్ గా నిలవొచ్చని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో సీజన్ ప్రారంభం నుంచి ఆర్మీ జవాన్ ట్యాగ్ తో బిగ్ బాస్ ప్రేక్షకుల అభిమానం చూరగొన్న పవన్ కల్యాణ్ పడాలపై ఒక సైనికులు సంచలన కామెంట్స్ చేశాడు. ఎస్‌జే సుందర్‌ అనే ఆర్మీ జవాన్ కల్యాణ్ పై విడుదల చేసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియోల్లో అతను ప్రధానంగా.. పవన్ పడాల అసలు ఆర్మీ జవాన్ కాదంటున్నాడు. ‘ఇండియన్‌ ఆర్మీలో పనిచేసే వ్యక్తి 90 రోజుల కంటే ఎక్కువగా బయట ఉండడు. ఒక వేళ అలా ఉంటే వారిని సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేస్తారు.

కల్యాణ్‌ బిగ్‌బాస్‌కు వచ్చి 90 రోజులవుతోంది. అంటే అతడిని డిపార్ట్‌మెంట్‌ నుంచి తీసేసినట్టే. అతడు ఇప్పటికే సోల్జర్‌ ఐడెంటిటీని కోల్పోయాడు. ఇప్పుడతడు జస్ట్ కామన్‌ మ్యాన్‌ మాత్రమే! అన్నట్లు మరో ముఖ్య విషయం.. కల్యాణ్ ఇండియన్‌ ఆర్మీ కాదు, అతను సీఆర్పీఎఫ్‌. సాధారణంగా జవాన్లకు లీవ్‌ దొరకడమే చాలా కష్టం. పవన్ పడాల అసలు ఇండియన్‌ ఆర్మీ కాదని, CRPF‌లో కొద్దికాలమే పనిచేసి వచ్చేశాడని, ఇండియన్‌ ఆర్మీలో పనిచేసే వ్యక్తి 90 రోజుల కంటే ఎక్కువగా బయట ఉండడం అసలు సాధ్యం కాదు. నాకు తెలిసి కల్యాణ్‌ ముందే రిజైన్‌ చేసి ఉండాలి.. లేదంటే ఇప్పుడైనా తనన డిస్మిస్‌ చేసుండాలి.

కల్యాణ్ ఆర్మీలో మూడు సంవత్సరాలు సేవలందించానని చెప్పాడు. కానీ, అది నిజం కాదు.. తొమ్మిది నెలలు ట్రైనింగ్‌, ఆరు నెలలపాటు మాత్రమే డ్యూటీ చేసి వచ్చేశాడు. ఏ సైనికుడైనా భారతీయ జెండాకు లేదా కమాండర్‌కు మాత్రమే సెల్యూట్‌ కొడతాడు. ఎవరికి పడితే వారికి సెల్యూట్ కొట్టడు’ అంటూ కల్యాణ్ తీరును తప్పుపట్టాడు సుందర్. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని కల్యాణ్ అభిమానులు తిప్పికొడుతున్నారు. CRPF అయినా.. ఆర్మీ అయినా.. దేశ సేవే చేసాడని, అతని పర్సనల్ లైఫ్ పై ఇలా విమర్శలు చేయడం సరికాదంటూ కౌంటర్స్ వేస్తున్నారు.

కాగా బిగ్ బాస్ షో ప్రారంభంలోనే తాను ఆర్మీకి రిజైన్ చేసి సి నటన వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నానని స్పష్టంగా చెప్పాడు. కేవలం కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే సైన్యంలో చేరినట్లు చెప్పుకొచ్చాడు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *