నివేదా పేతురాజ్ ..ఈ ఏడాది ఆగస్టులో దుబాయ్‌కి చెందిన మలయాళీ వ్యాపారవేత్త రాజ్ హిత్ ఇబ్రాన్‌తో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ముందుగా గోప్యంగా ఉంచి, ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయితే 2016లో తమిళంలో వచ్చిన ఓరు నాళ్ కోత్తు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఈ అమ్మడు…
శ్రీ విష్ణు నటించిన మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత అల వైకుంఠపురములో, రెడ్, దాస్ కా ధమ్కీ వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లతో ఓటీటీ సినీప్రియులను సైతం అలరించింది.
పరువు అనే వెబ్ సిరీస్ చేసింది. ప్రస్తుతం ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో కార్ రేసింగ్ పై దృష్టిపై దృష్టిపెట్టింది. ఇదిలా ఉంటే.. ఇటీవలే దుబాయ్ లో స్థిరపడిన వ్యాపారవేత్త రాజ్ హిత్ ఇబ్రాన్‌తో ఆమె నిశ్చితార్థం జరిగింది. అతడితో కలిసి ఉన్న ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేసింది నివేదా.
అయితే ఇప్పుడు ఆమె రాజ్ హిత్ ఇబ్రాన్ తో కలిసి ఉన్న ఫోటోస్ అన్నింటిని డిలీట్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందనే ప్రచారం జోరుగా వినిపిస్తుంది. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ నెట్టింట మాత్రం వీరి పెళ్లి క్యాన్సిల్ అనే టాక్ మాత్రం నడుస్తుంది. ప్రస్తుతం నెట్టింట తన గురించి జరుగుతున్న ప్రచారం పై నివేదా స్పందించలేదు.
