సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్, కోట్లలో రెమ్యునరేషన్లు గుర్తొస్తాయి. కానీ ఇక్కడ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు అన్నీ వదులుకుని, లైఫ్ జీరో అయ్యాక మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వడమంటే మామూలు విషయం కాదు. అయితే భానుప్రియ చెల్లెలి పేరు శాంతి ప్రియ. 90’s లో యూత్ ఫేవరేట్ హీరోయిన్ ఆమె. 1980 చివర్లో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సౌగంధ్ సినిమాతో తెరంగేట్రం చేసింది.
ఆ తర్వాత 1987లో వచ్చిన కాబోయే అల్లుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.ఈ సినిమా తర్వాత తెలుగులో మహార్షి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.1990లో జస్టిస్ రుద్రమదేవి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ఈ మూవీ తర్వాత మరో మూవీ చేయలేదు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. 1999లో నటుడు సిద్ధార్థ్ రే ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే పెళ్లైనా కొన్నాళ్లకే ఆమె భర్త సిద్ధార్థ్ రే 2004లో హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. అప్పుడు అతడి వయసు 40 సంవత్సరాలు మాత్రమే. భర్త మరణం తర్వాత కుంగిపోయిన శాంతిప్రియ.. తన కుమారులతో ఒంటరిగా లైఫ్ లీడ్ చేసింది. దాదాపు 30 ఏళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న శాంతి ప్రియ 2025లో వచ్చిన బ్యాడ్ గర్ల్ సినిమాతో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
