రెహమాన్..ఆయన అసలు పేరు దిలీప్ కుమార్. 1980 చివర్లో ఆయన తన పేరు మార్చుకున్నారు. అదే సమయంలో ఇస్లాం మతాన్ని స్వీకరించారు. దీనికి గల కారణాలను రెహమాన్ 2000 సంవత్సరంలో బీబీసీ టాక్ షోలో కరణ్ తపార్‌తో మాట్లాడుతూ వెల్లడించారు. తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి, పేరు మార్పు వెనుక ఉన్న నేపథ్యం గురించి ఆయన వివరించారు. ఈ మార్పు ఆయన జీవితంలో శాంతిని, స్వేచ్ఛను తీసుకువచ్చిందని ఆయన తెలిపారు.
రెహమాన్ తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు ఒక సూఫీ సాధువు చికిత్స అందించారు. తండ్రి మరణించిన తర్వాత కూడా ఆ సాధువు రెహమాన్ కుటుంబాన్ని ఆరు సంత్సరాల పాటు ఆదుకున్నారు. ఈ ప్రభావంతోనే ఆ కుటుంబం క్రమంగా ఆ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. రెహమాన్ ఒక హిందూ కుటుంబంలో పెరిగారు. ఆయన తల్లి హిందూ మతాన్ని పాటించేవారు. ఇంట్లో హిందూ దేవతల చిత్రాలు ఉండేవి.
వీటితో పాటు మదర్ మేరీ, ఏసు, మక్కా, మదీనా ఫోటోలు కూడా ఇంట్లో ఉండేవని ఆయన గుర్తు చేసుకున్నారు. తనకు పుట్టికతో వచ్చిన పేరు దిలీప్ కుమార్ అంటే రెహమాన్‌కు అస్సలు ఇష్టం ఉండేది కాదని ఆయన తెలిపారు. దిలీప్ కుమార్ అనే మహానటుడిపై గౌరవం ఉన్నప్పటికీ, ఆ పేరు తన వ్యక్తిత్వానికి సరిపోదని ఆయన భావించారు. ఈ నేపథ్యంలో, తన తల్లి కలలో ‘అల్లా రఖా’ అనే పేరు వచ్చింది. తర్వాత కుటుంబ సభ్యులు చర్చించుకుని ‘రెహమాన్’ అనే పేరును ఎంచుకున్నారు.

అంతకుముందు రెహమాన్ సోదరి వివాహం సందర్భంగా పేరు మార్చడం గురించి ఒక హిందూ జ్యోతిష్యుడిని సంప్రదించారు. ఆ జ్యోతిష్యుడు ‘అబ్దుల్ రెహమాన్’ లేదా ‘అబ్దుల్ రహీం’ అనే పేర్లను సూచించారు. అయితే, ఆయనకు ‘రెహమాన్’ అనే పేరు బాగా నచ్చింది. మత మార్పిడిపై సమాజం నుంచి తనకు పెద్దగా విమర్శలు ఎదురుకాలేదని, తమ చుట్టూ ఉన్నవారు ఆ విషయాన్ని పట్టించుకోలేదని రెహమాన్ చెప్పారు.
సంగీతం తమకు స్వేచ్ఛను ఇచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. బాల్యం నుంచి ఆయనకు ఆధ్యాత్మికతపై ఆకర్షణ ఉండేది. తండ్రి మరణం తరువాత సూఫీ సాధువు ప్రభావం మరింత పెరిగింది. 1967లో చెన్నైలో జన్మించిన ఎ.ఆర్ రెహమాన్.. రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రాలకు సంగీతం అందించడం ద్వారా చాలా ఫేమస్ అయ్యాడు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రానికి పలు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారు.
ఆయన పద్మభూషణ్, భారతరత్న అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకు కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. ఇప్పటికే చికిరి అనే పాట దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిన విషయం తెలిసిందే.
