మరో 15 రోజుల్లో సీజన్ పూర్తికానుంది. ఇక ఇప్పటివరకు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ మంచి టీఆర్పీ సొంతం చేసుకుంది బిగ్ బాస్ షో. ఇక వారాంతం వచ్చిందంటే చాలు కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడించి ఆతర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. వారం వారం ఒకొక్కరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తున్నారు.
13వ వారం బిగ్ బాస్ నుంచి పక్కాగా సుమన్ శెట్టి బయటకు వెళ్తాడు అని అంతా అనుకున్నారు. నామినేషన్స్‌లో రీతూ, భరణి, సుమన్, సంజన లు డేంజర్ జోన్లో ఉండగా.. సుమన్ కంటే మిగిలిన వారు చాలా స్ట్రాంగ్ కదా.. పక్కాగా సుమన్ ఎలిమినేట్ అవుతాడని ప్రచారం జరిగింది. అంతే కాదు ఈసారి డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చనే టాక్ వినిపించింది.
అయితే ఇక 13వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి ఎంత సంపాదించిందో తెలుసా..? రీతూ చౌదరికి బిగ్ బాస్ ద్వారా బాగానే రెమ్యునరేషన్ అందిందని తెలుస్తుంది. వారానికి రూ. 2.50 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. దాంతో 13 వారాలకు గానూ మొత్తంగా రూ. 32 లక్షల మేరకు రెమ్యునరేషన్‌గా అందుకుందని టాక్ వినిపిస్తుంది.
మొత్తంగా బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో బాగానే సంపాదించిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
