జ్వరం,కుట్టిన చోట నల్లటి మచ్చ లేదా దద్దుర్లు తలనొప్పి, శరీరం నొప్పులు, వాంతులు,పొడి దగ్గు బలహీనత్వం. ఈ వ్యాధి ఇళ్లు, పొలాల్లో ఉండే చిగ్గర్ మైట్ అనే చిన్న కీటకం ద్వారా వ్యాపిస్తుంది. తదేకంగా పరిశీలిస్తేగానీ ఈ కీటకం కంటికి కనిపించడదు.. ఇది కుడితే దానిలోని ఓరియెంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి చేరుతుంది. ఇది కుట్టినచోట శరీరం నల్లగా కాలినట్లు మారిపోతుంది… దద్దుర్లు వచ్చి దురద పెడుతుంది.
ఇక శరీరంలోకి చేరిన బ్యాక్టీరియా మెళ్లిగా ఆరోగ్యాన్ని దెబ్బతీసి చివరకు ప్రాణాలు తీస్తుంది. ఈ స్క్రబ్ టైపస్ బారిన పడ్డవారిలో మొదట శరీరం నీరసంగా మారిపోతుంది… ఏ పని చేయలేకపోతారు. తర్వాత చలిజ్వరం, తల, ఒళ్లనొప్పులు మొదలవుతాయి. అలాగే జీర్ణ, శ్వాస సమస్యలు వస్తాయి. శరీరంలోని ఒక్కో అవయవం బ్యాక్టీరియా ప్రభావంతో దెబ్బతిని మనిషి కోమాలోని వెళ్లే అవకాశాలుంటాయి… చివరకు ప్రాణాలు పోవచ్చు.

స్క్రబ్ టైపస్ వ్యాధి బారిన పడ్డవారికి వీలైనంత తొందరగా వైద్యం అవసరం. లేదంటే మెళ్లిగా ప్రారంభమయ్యే అనారోగ్యం చివరకు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కి కారణం అవుతుంది. అనేక అనారోగ్య సమస్యలు ఒకేసారి చుట్టిముట్టి ప్రాణాంతకంగా మారవచ్చు. ముందుగానే వ్యాధిని గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం తప్పుతుంది. స్క్రబ్ టైపస్ వ్యాధిని గుర్తించేందుకు ర్యాడిప్, వైల్ ఫెలిక్స్, ఐజీఎం ఎలీసా వంటి టెస్టులు చేస్తారు.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోని హాస్పిటల్స్ లో వ్యాధి నిర్దారణ టెస్టులు అందుబాటులో ఉంటాయి. స్క్రబ్ టైపస్ బారిన పడ్డవారు వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స పొందాలి.. లేదంటే ఇది ప్రాణాంతకంగా మారుతుంది. స్క్రబ్ టైపస్ అనేది అంటువ్యాధి కాదు… ఒకరి నుండి ఒకరికి సోకదు. కేవలం ప్రత్యేక కీటకం ద్వారానే ఇది వ్యాప్తి చెందుతుంది.
దీని బారినపడి ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో ఐదుగురు మరణించారు. పల్నాడులో జ్యోతి, నాగమ్మ… విజయనగరంలో రాజేశ్వరి… బాపట్లలో మస్తాన్ బి… నెల్లూరులో సంతోషి మరణించారు.
