గత తొమ్మిది త్రైమాసికాలుగా బంగారం ధరలు కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. ఇది 10 సంవత్సరాల బుల్ సైకిల్ బలాన్ని ప్రతిబింబిస్తుంది. 2025 అక్టోబర్‌లో బంగారం ఔన్సుకు 4,398 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత అది 11 శాతం తగ్గి 3,891 డాలర్లకి చేరుకుంది, కానీ డిసెంబర్‌లో బాగా కోలుకుని ఔన్సుకు 4,299 డాలర్లకి తిరిగి వచ్చింది. అయితే గత కొద్దిరోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి.
ఒకరోజు తగ్గితే.. మరొక రోజు పెరుగుతున్నాయి. దీంతో గోల్డ్ రేట్లు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అర్థం కావడం లేదు. గురువారం ఒక్కసారిగా వెండి ధర రెండు లక్షల మార్క్‌కు చేరుకుని ఆల్ టైం రికార్డ్‌గా నిలిచింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర బంగారం 1,29,650 వద్ద కొనసాగుతోంది. గురువారం రూ.1,29,660గా ఉంది.

నిన్నటితో పోలిస్తే ఇవాళ రూ.10 తగ్గింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,18,840 వద్ద కొనసాగుతోంది. గురువారం రూ.1,18,850 వద్ద ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.1,29,650గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,18,840 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,120 వద్ద కొనసాగుతుండగా..
22 క్యారెట్ల ధర రూ.1,20,190గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,650 వద్ద కొనసాగుతుండగా..22 క్యారెట్ల ధర రూ.1,18,840గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,29,800 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,18,990 వద్ద ఉంది.
