ఐశ్వర్య రాయ్. భారతదేశంలోని అత్యంత ధనవంతులైన నటీమణుల జాబితాలో చోటు సంపాదించారు ఐశ్వర్య. 1973 నవంబర్ 1న కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన ఐశ్వర్య రాయ్ 1994లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. దక్షిణ భారత సంప్రదాయ కుటుంబంలో పెరిగిన ఐశ్వర్య రాయ్ బచ్చన్, 2007లో నటుడు అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకున్నారు.
2011లో ఆరాధ్య అనే కూతురు జన్మించింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాల్లో నటించిన ఐశ్వర్య ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ప్రస్తుతం బ్రాండ్ ప్రమోషన్స్, వ్యాపారంలో బిజీగా ఉంటుంది. ఐశ్వర్య రాయ్ దుబాయ్‌లో రూ.15 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంటిని కలిగి ఉంది. ఈ ఇల్లు దుబాయ్‌లోని జుమేరా గోల్ఫ్ ఎస్టేట్‌లోని సాన్క్చువరీ ఫాల్స్‌లో ఉంది. ఈ ఇంటిని అత్యంత విలాసవంతంగా నిర్మించినట్లు సమాచారం.
ఐశ్వర్య రాయ్ 2015లో బాంద్రాలో 5BHK బంగ్లాను రూ.21 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది 5,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుత విలువ రూ.50 కోట్లుగా అంచనా. ఐశ్వర్య రాయ్ దగ్గర కూడా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆమె దగ్గర రోల్స్ రాయిస్ ఘోస్ట్, ఆడి A8L, మెర్సిడెస్ బెంజ్ S500, మెర్సిడెస్ బెంజ్ S350d కూపే వంటి అనేక లగ్జరీ కార్లను కలిగి ఉంది. ఐశ్వర్య రాయ్ మొత్తం ఆస్తుల విలువ రూ. 900 కోట్లు. ఆమె భారతదేశంలోని అత్యంత ధనిక నటీమణులలో ఒకరు.
ఆమె ఒక్కో సినిమాకు రూ. 10-12 కోట్లు తీసుకుంటుందని సమాచారం. అనేక వ్యాపారాల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. చివరిసారిగా 2023లో విడుదలైన పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రంలో కనిపించింది.
