Karthika Deepam: నిత్యజీవితంలో కూడా భర్తతో కష్టాలు పడుతున్న ‘కార్తిక దీపం’ వంటలక్క. నాతో అస్సలు ఉండడు అంటూ..!

divyaamedia@gmail.com
2 Min Read

Karthika Deepam: నిత్యజీవితంలో కూడా భర్తతో కష్టాలు పడుతున్న ‘కార్తిక దీపం’ వంటలక్క. నాతో అస్సలు ఉండడు అంటూ..!

Karthika Deepam: ‘కార్తీక దీపం’ సీరియల్‌లో వంటలక్కగా బుల్లితెర ప్రేక్షకులకు ఆమె సుపరిచితం. ఎంతోమంది ప్రేక్షకులు ఆమెను తమ సొంత ఇంట్లో ఆడపిల్లలా భావించారు. ఆమె సీరియల్‌లో కన్నీళ్లుపెడితే ఏడ్చేశారు. ఆమెకి మంచి జరిగితే ఆనందపడ్డారు. అంతలా ఓన్‌ చేసుకున్నారు వంటలక్కని. అయితే నిజానికి ప్రేమి విశ్వనాథ్ మలయాళీ నటి. అంతేకాకుండా తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుని సీరియల్ హీరోయిన్ కూడా ఈమెనే.

Also Read: డబుల్ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన మెగాస్టార్ సినిమాకి నో చెప్పిన శ్రీలీల.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ప్రేమి విశ్వనాథ్ తన పర్సనల్ విషయాలను నెటీజన్లతో పంచుకుంది. ఆ మధ్య జరిగిన ఓ ఇంటర్వూలో తన భర్త, పిల్లల గురించి చెప్పుకొచ్చింది. కార్తిక్ దీపంలో సీరియల్‌గా అవకాశం వచ్చాక తను తన పిల్లల్ని వదిలేసి ఇక్కడికి వచ్చానని చెప్పింది. అంతేకాకుండా తన బిజీ లైఫ్ కారణంగా తన భర్త దగ్గర అస్సలు ఉండటం కుదరదని చెప్పుకొచ్చింది. తన భర్త, తన కంటే బాగా బిజీగా ఉంటాడని, తను కేరళలో ఉన్నప్పుడు..

తన భర్త వేరే రాష్ట్రంలో ఉంటాడని… తను ఒక రాష్ట్రంలో ఉంటే ఆయన మరో రాష్ట్రంలో ఉంటారని చెప్పుకొచ్చింది. ఇలా ఇద్దరి లైఫ్ లు బిజీ బిజీగా ఉండటం కారణంగా ఎప్పుడో ఒకసారి కలుస్తామని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రేమి విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రేమి విశ్వనాథ్.. 2014లో ‘కరుతముత్తు’ అనే మలయాళ టెలివిజన్ తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రెండు, మూడు మళయాల సీరియల్స్‌లో చేసింది.

Also Read: నాగ చైతన్య-శోభితల పెళ్లి ముహూర్తం ఇదే, డెస్టినేషన్ వెడ్డింగ్‌ కోసం ఏకంగా..?

ఇక 2017లో కార్తిక దీపం సీరియల్‌తో తెలుగులో కి ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ ప్రేమి విశ్వనాథ్ కు తిరుగులేని పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నాగచైతన్య నటించిన కస్టడీ సినిమాలో మంగళం అనే చిన్న క్యారెక్టర్ చేసింది. ప్రస్తుతం తమిళంలో సల్మాన్ 3డీ అనే సినిమా చేస్తుంది. విజయ్ యేసుదాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు షాలిల్ కల్లూర్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం కార్తిక దీపం 2 సీరియల్‌లో నటిస్తుంది.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *