డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా యోగా సెంటర్‌లో రాజ్, సమంత పెళ్లి చేసుకున్నారు. అక్కడి లింగ భైరవి ఆలయంలో ‘భూత శుద్ధి వివాహ’ అనే ఆధ్యాత్మిక పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. కేవలం ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య ఈ వేడుక చాలా సింపుల్‌గా ముగిసింది. అయితే కోయంబత్తూర్‌లో చాలా సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న ఈ జంట..
హనీమూన్, గిఫ్ట్స్ విషయంలో మాత్రం ట్రెండింగ్‌లో నిలుస్తోంది. మామూలుగా పెళ్లయిన వెంటనే జంటలు ఫారెన్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటారు. కానీ సమంత, రాజ్ మాత్రం వెరైటీగా ఒక్క రోజు హనీమూన్‌కే ఫిక్స్ అయ్యారు. ఈరోజు ఈ జంట గోవా ఫ్లైట్ ఎక్కేసింది. రేపు రిటర్న్ అయిపోతారట. ఎయిర్ పోర్టులో ఫుల్ ఖుషీగా కనిపిస్తూనే దీనిపై సమంత క్లారిటీ ఇచ్చింది. “నా లైఫ్‌లో ఇంత హ్యాపీగా ఎప్పుడూ లేను. రాజ్ రాకతో నా లైఫ్ కంప్లీట్ అయ్యింది.

కానీ ప్రస్తుతం మాకు ఒక్క రోజు హనీమూన్ మాత్రమే కుదురుతుంది. ఎందుకంటే నాకు రేపటి నుంచే షూటింగ్ ఉంది. మళ్లీ ఎప్పుడైనా తీరిగ్గా వెళ్తాం” అని నవ్వుతూ చెప్పింది. వర్క్ కమిట్‌మెంట్స్ వల్ల వీళ్లు వెంటనే డ్యూటీలో చేరాల్సి వస్తోంది. అత్తింటివారి గ్రాండ్ వెల్కమ్. మరోవైపు రాజ్ ఫ్యామిలీ నుంచి సమంతకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. రాజ్ సిస్టర్ శీతల్ నిడిమోరు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
“ఈ బంధం మా ఫ్యామిలీలోకి ప్రశాంతతను తీసుకొచ్చింది. అందరికీ ఇలాంటి ప్యూర్ లవ్, స్ట్రాంగ్ బాండింగ్ దొరకాలి అని కోరుకుంటున్నాను” అని రాసుకొచ్చింది. దీనికి సమంత కూడా “లవ్ యూ” అంటూ అంతే స్వీట్‌గా రిప్లై ఇచ్చింది.
