డిసెంబర్ 1నే సమంత రెండో పెళ్ళి ఎందుకు చేసుకుందో తెలుసా..?

divyaamedia@gmail.com
1 Min Read

సమంత, రాజ్.. గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న వీరు డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లోని లింగ భైరవి ఆలయంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సమంత పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

అయితే తన రెండో భర్త ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే.. సమంత డిసెంబర్ 1నే పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటా జనాలు తెగ సెర్చ్ చేస్తున్నారు. కాగా.. కొందరు డిసెంబర్ 1న సమంత పక్కా ప్లాన్ ప్రకారమే పెళ్లి చేసుకుందని చెబుతున్నారు. ఇంతకీ అదే డేట్‌‌న ఎందుకు పెళ్లి చేసుకుందంటే..

సరిగ్గా గతేడాది నాగ చైతన్య, శోభితా దూళిపాళ్ల పెళ్లి జరిగింది. వాళ్ల పెళ్లి డిసెంబర్ 4న జరిగింది. అయితే.. డిసెంబర్ 1కి ఉన్న కనెక్షన్ ఏంటంటే.. డిసెంబర్ 1న నాగ చైతన్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ను స్టార్ట్ చేశాడు. అందుకే అదే డేట్‌ను సామ్ రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందని.. అనుకున్నట్లుగానే డిసెంబర్ 1న మూడు ముళ్లు వేయించుకుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇదంతా ట్రాష్ అంటూ పలువురు సామ్ ఫ్యాన్స్ కొట్టిపడేయగా.. కొందరు మాత్రం సమంత ఇలా కూడా ఆలోచిస్తుందా అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతేనేం సమంత రెండో పెళ్లి చేసుకోవడంతో ఆమె ఫ్యాన్స్ మాత్రం పట్టరాని సంతోషంతో ఉన్నారు. ఆమె పెళ్ళిపై టాలీవుడ్ సెలబ్రిటీల నుంచి బాలీవుడ్ తారల వరకు చాలా మంది విషెస్ తెలియచేస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *