డియోడరెంట్ వాడటం వల్ల క్యాన్సర్..! డాక్టర్ ఏం చెప్పారో తెలిస్తే..?

divyaamedia@gmail.com
2 Min Read

డియోడరెంట్ వాడితే రొమ్ము క్యాన్సర్ వస్తుందా.. ఉదయం ఫ్రెష్‌గా ఉండేందుకు ప్రతిరోజూ డియోడరెంట్ వాడే అలవాటు ఉన్నవారిలో ఈ సందేహం ఎక్కువగా ఉంటుంది. అయితే పరిమళాలు వెదజల్లే ఈ డియోడరెంట్లను తయారు చేయడానికి రకరకాల రసాయనాలను వాడుతారు. వాటి వల్ల క్యాన్సర్ రిస్క్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అల్యూమినియం ఆధారిత సమ్మేళనాలు, పారాబెన్ సహిత పెర్ఫ్యూమ్స్తో ఈ రిస్క్ ఎక్కువ అనే వాదన కూడా ఉంది.

అయితే ఇందులో నిజం ఎంత? నిజంగానే పెర్ఫ్యూమ్స్ వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందా? పెర్ఫ్యూమ్స్ వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందనేది అపోహ మాత్రమే అంటున్నారు పలువురు నిపుణులు. దీనికి ఎలాంటి సిద్ధాంతపరమైన ఆధారాలు లేవని, ఊహాజనితమైన భయాలని చెబుతున్నారు. పరిశోధనలు, అధ్యయనాలు మాత్రం… సాధారణ డియోడరెంట్ వాడకానికి, రొమ్ము క్యాన్సర్‌కు గానీ, లేదా ఇతర రకాల క్యాన్సర్లకు గానీ ఎలాంటి పటిష్టమైన ఆధారాన్నీ కనుగొనలేకపోయాయి.

అంటే, ఈ భయానికి నిజజీవితంలో ఎలాంటి రుజువు లభించలేదు. రోజువారీగా డియోడరెంట్ వాడటం ప్రమాదమేమీ కాదనే వాదన వినిపిస్తోంది. రోజూ వాడే డియోడరెంట్ గురించి అనవసరంగా కంగారు పడకూడదు. సైన్స్ ప్రకారం నిజమైన క్యాన్సర్ ముప్పు లేదు. కానీ, ఏవైనా పెర్ఫ్యూమ్స్ కొనేముందు దానిలో వాడే పదార్థాలేంటో చదవడం మంచిది. అల్యూమినియం-ఫ్రీ, పారాబెన్-ఫ్రీ పెర్ఫ్యూమ్లను ఎంచుకుంటే భవిష్యత్తులోనూ ఎటువంటి ప్రమాదం రాకుండా జాగ్రత్త పడవచ్చు.

క్యాన్సర్ రిస్క్ని తగ్గించడానికి, సమతుల్య ఆహారం తినడం, శారీరక వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది. రసాయనాలు లేని సహజ ఉత్పత్తులను ఎంచుకుని వాడటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. సహజపద్ధతుల్లో తయారుచేసిన పలు పరిమళాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరెందుకు ఆలస్యం నచ్చిన ఫ్లేవర్ పెర్ఫ్యూమ్ని ఎంచుకుని భయంలేకుండా వాడేయండి!అల్యూమినియం ఆధారిత సమ్మేళనాలు తాత్కాలికంగా చెమట గ్రంథులను అడ్డుకుంటాయి.

పెర్ఫ్యూమ్స్ని ఎక్కువగా చంకల్లో, ఛాతిమీద కొట్టుకోవడం వల్ల రొమ్ము కణజాలంలో హార్మోన్ల సమతుల్యత మారి క్యాన్సర్కి దారితీయవచ్చని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, పారాబెన్స్ సహిత పెర్ఫ్యూమ్స్ శరీరంలోని కొన్ని కణాలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ పనితీరుని ప్రభావితం చేస్తాయని తేలింది. దీనివల్ల రొమ్ము క్యాన్సర్ వృద్ధి చెందుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *