అనిరుధ్, కావ్య మారన్ ఫారిన్‌లో సీక్రెట్‌గా షికార్లు చేస్తూ ఫ్యాన్స్‌కు దొరికిపోయారు. దాంతో మరోసారి వీరి లవ్ స్టోరీ హాట్ టాపిక్‌గా మారింది. అనిరుధ్, కావ్య మారన్ జంటగా ట్రిప్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే అనిరుధ్ ఒక సంవత్సరం పైగా కావ్యతో డేటింగ్‌లో ఉన్నాడని, రజినీకాంత్ (అనిరుధ్ మామ) కావ్య తండ్రి కళానిధి మారన్‌తో మాట్లాడినట్టు కూడా జరిపారని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
అయితే అనిరుధ్ మాత్రం అవన్నీ కేవలం రూమర్స్ అని Xలో పోస్ట్ పెట్టాడు. ‘పెళ్లా? లాల్.. చిల్ అవుట్ గైస్. రూమర్స్ ఆపండి’ అని స్పష్టం చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) CEOగా ఉన్నారు కావ్య మారన్. సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్ కుమార్తె. IPL మ్యాచ్‌ల సమయంలో ఆమె అప్పీల్ ఎక్కువ. అనిరుధ్ సన్ పిక్చర్స్ సినిమాలకు (జవాన్, జన నాయగన్) సంగీతం అందిస్తున్నాడు.

SRH యాంథమ్‌కు కూడా ఆయనే మ్యూజిక్ అందించాడని టాక్. ఈ వృత్తిపరమైన సంబంధమే వారిని తరచూ కలిసి కనిపించేలా చేస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అనిరుధ్.. దళపతి విజయ్ ‘జన నాయగన్’ నుంచి ‘తలపతి కచేరి’ సింగిల్ విడుదల చేశాడు. ఈ పాటను విజయ్, అరివు పాడగా, లాస్ట్ మినిట్ డాన్స్ నంబర్ 2026 జనవరి 9 రిలీజ్‌కు రిజర్వ్ చేశారు.
అలాగే ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’, షారుఖ్ ‘కింగ్’, రజినీ ‘జైలర్ 2’, నాని ‘ది పారడైస్’ వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు అనిరుధ్. తాజాగా వచ్చిన రూమర్స్‌పై వీరిద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. దీని గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
