బంగారం కొనుగోలు అంటే గాజులు, గొలుసులు, ఉంగరాల రూపంలోనే కొనుగోలు చేస్తుంటారు. కానీ ఆభరణాలలో తయారీ ఛార్జీలు, స్వచ్ఛత సందేహాలు, పునఃవిక్రయ నష్టాలు రాబడిని తినేస్తాయి. 2025లో సగటు తయారీ ఛార్జీలు ఇప్పటికీ 8 నుంచి 20 శాతం మధ్య ఉంటాయి. ఆభరణాల వ్యాపారులు తగ్గింపుతో తిరిగి కొనుగోలు చేస్తారు.
అయితే బంగారమే కాదు.. వెండి కూడా పరుగులు పెడుతోంది. ఎలక్ట్రికల్ వాహనాలతో పాటు ఇతర పరికరాలలో వెండిని ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో ఈ మధ్య కాలం నుంచి వెండికి భారీ డిమాండ్ పెరిగింది. బంగారం లాగే వెండి కూడా పరుగులు పెడుతోంది. భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తర్వాత మళ్లీ తగ్గుతూ వస్తున్నాయి. కొంత మేరకు తగ్గాయి.
అయితే గత రెండు రోజులుగా పసిడి రేటు మళ్లీ పరుగులు పెట్టింది. అయితే ఈ రోజు మాత్రం గోల్డ్ రేటు మళ్లీ పడిపోయింది. నిన్న హైదరాబాద్లో బంగారం ధరను చూస్తే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 మేర పడిపోయింది. ప్రస్తుతం బంగారం ధర రూ.1,25,550 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,040 వద్ద ఉంది.

ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,650 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,15,190 ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,25,500 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,040 వద్ద ఉంది. విజయవాడలో 4 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,25,500 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,040 వద్ద ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,26,550 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,990 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,26,500 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,040 వద్ద ఉంది. కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,26,500 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,040 వద్ద ఉంది.
కోల్కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,26,500 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,040 వద్ద ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే స్వల్పంగా పెరిగింది. కిలోకు రూ.1,62,100 ఉంది. అయితే హైదరాబాద్, చెన్నై, కేరళలలో మాత్రం భారీగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.1,73,100 వద్ద కొనసాగుతోంది. బంగారం ధర తగ్గుతూ ఉంటే వెండి మాత్రం పెరుగుతోంది.
