Aadhaar Address: మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఇలా సింపుల్ గా అప్‌‌డేట్ చేసుకోవచ్చు. ఎలాగంటే..?

divyaamedia@gmail.com
3 Min Read

Aadhaar Address: మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఇలా సింపుల్ గా అప్‌‌డేట్ చేసుకోవచ్చు. ఎలాగంటే..?

Aadhaar Address: మీ ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేయడానికి అధికారిక UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన మీ ఆధార్ నంబర్, OTPని ఉపయోగించి లాగిన్ చేయండి. లాగిన్ అయిన తర్వాత, మీరు చిరునామా, పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి సమాచారాన్ని అప్‌డేట్ చేయవచ్చు.

అయితే : మీ ఆధార్ కార్డులోని అడ్రస్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని భావిస్తున్నారా? వాస్తవానికి, ఆధార్ అనేది ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డు మాత్రమే కాదు.

వివిధ సర్వీసులు, ప్రయోజనాలను యాక్సెస్ చేసే కీలకమైన డాక్యుమెంట్ కూడా. మీరు ఇటీవల మరో ఇంటికి మారినట్టయితే.. ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో మీ ఆధార్ అడ్రస్ ఎలా అప్‌డేట్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఆన్‌లైన్ విధానం :- మైఆధార్ పోర్టల్‌ని విజిట్ చేయండి : అధికారిక యూఐడీఏఐ వెబ్‌సైట్‌కి వెళ్లండి. (https://myaadhaar.uidai.gov.in/) మీ ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి లాగిన్ చేయండి.

Also Read: యూపీఐ ద్వారా డబ్బులు పంపేవారికి మంచి వార్త చెప్పిన RBI.

అడ్రస్ అప్‌డేట్ నావిగేట్ చేయండి : ‘myaadhaar’ ట్యాబ్‌ని ఆపై ‘Udate Aadhaar’ ఆప్షన్ ట్యాప్ చేసి ఆ తర్వాత ‘Update Address Online’ బటన్ నొక్కండి. మీ అడ్రస్ వివరాలను ఎంటర్ చేయండి : ఇంటి నంబర్/పేరు, వీధి, ప్రాంతం, గ్రామం/పట్టణం, జిల్లా, రాష్ట్రం, పిన్ కోడ్‌తో సహా మీ కొత్త అడ్రస్ సమాచారంతో ఫారమ్‌ను నింపండి. మీ అడ్రస్ ప్రూఫ్ కచ్చితత్వం, స్థిరత్వాన్ని నిర్ధారించుకోండి.

అడ్రస్ ప్రూఫ్ అప్‌లోడ్ చేయండి : మీ పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా యుటిలిటీ బిల్లు (3 నెలల కన్నా పాతది కాదు) వంటి అడ్రస్ డాక్యుమెంట్లు చెల్లుబాటు అయ్యే రుజువును స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి. ప్రివ్యూ, సబ్మిట్ : నమోదు చేసిన అన్ని వివరాలు, ప్రూఫ్ డాక్యుమెంట్లను జాగ్రత్తగా రివ్యూ చేయండి.

సంతృప్తి చెందిన తర్వాత ‘Submit’ అప్‌డేట్ రిక్వెస్ట్ పంపవచ్చు. మీ అప్‌డేట్ ట్రాక్ చేయండి: మీరు ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ (URN)ని అందుకుంటారు. మైఆధార్ పోర్టల్‌లో మీ అడ్రస్ అప్‌డేట్ రిక్వెస్ట్ స్టేటస్ ట్రాక్ చేయడానికి ఈ URNని ఉపయోగించండి.

ఆఫ్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలంటే? :- ఆధార్ సర్వీసు సెంటర్ సందర్శించండి : మీ సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని (ASK) గుర్తించండి. ఆధార్ సర్వీసుల కోసం నియమించిన సెంటర్ ఇది. మీరు యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో (ASK) జాబితాను కనుగొనవచ్చు.

ఆధార్ అప్‌డేట్ ఫారమ్‌ను నింపండి : యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి ఆధార్ అప్‌డేట్ ఫారమ్ (ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ అప్‌డేట్ ఫారమ్) డౌన్‌లోడ్ చేసి నింపండి.

Also Read: ఏ బ్యాంక్ నుంచైనా లోన్ తీసుకొని EMI కట్టలేని వారికి గుడ్ న్యూస్.

మీరు ఏఎస్‌కే వద్ద కూడా పొందవచ్చు. ఫారమ్, డాక్యుమెంట్లను సమర్పించండి: ఏఎస్‌కే అధికారులకు చెల్లుబాటు అయ్యే అడ్రస్ ప్రూఫ్‌తో పాటు పూర్తి చేసిన ఫారమ్‌ను సమర్పించండి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ : అథెంటికేషన్ కోసం బయోమెట్రిక్ వెరిఫికేషన్ (వేలిముద్రలు, ఐరిస్ స్కాన్) చేయించుకోండి.

అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ : మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (SRN)ని కలిగి ఉన్న రసీదు స్లిప్‌ను పొందవచ్చు. మీ అప్‌డేట్ రిక్వెస్ట్ స్టేటస్ ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయడానికి లేదా యూఐడీఏఐ హెల్ప్‌లైన్ (1948)కి కాల్ చేయడం ద్వారా ఈ ఎస్ఆర్ఎన్ ఉపయోగించండి.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *