ప్రపంచంలో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. బాబా వంగా వారిలో ఒకరు. ఆమె అంచనాలు అత్యంత ప్రసిద్ధమైనవి ఎందుకంటే బాబా వంగా ప్రతి సంవత్సరం ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలను అంచనా వేశారు. వాటిలో చాలా ఖచ్చితమైనవిగా నిరూపితం అయ్యాయి. అందుకే ఆమె అంచనాలను సంవత్సరం తర్వాత సంవత్సరం అర్థం చేసుకుంటారు. అయితే అంతకుముందు ఇండియన్ ఐరన్ లేడీ ఇందిరాగాంధీ తూటాలకు బలౌతుందన్నారు, బలయ్యారు.
ఒక బక్కపల్చటి నల్లవాడు అమెరికా 44వ అధ్యక్షుడౌతారన్నారు-అయ్యారు. 2008లో వచ్చిన ఆర్థికమాంద్యం, నిన్నమొన్నటి మయన్మార్ భూకంపం.. అన్నీ ఆమె చెప్పినట్టే జరిగాయి. మరి.. 2026లో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందన్నారు.. వస్తుందా? ఔను, బల్గేరియాలో 30 ఏళ్లకిందటే చనిపోయిన మార్మిక సన్యాసిని.. పేరు బాబా వంగా. ఆమె చెప్పిన కాలజ్ఞానం ఇప్పుడు ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది. ఎప్పటినుంచో భయపెడుతూ వస్తున్న థర్డ్ వరల్డ్‌వార్‌కి నెక్స్ట్ క్యాలెండరే కేరాఫ్ కాబోతోందట.
ప్రకృతి విపత్తులు, ఆర్థిక సంక్షోభాలు, హద్దులు దాటి హడలెత్తిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్.. ఇవన్నీకలిసి, వచ్చే ఏడాదిని డేంజరస్ ఇయర్‌గా మార్చేస్తాయట. బంగారం ధరలు భారీగా పెరుగుతాయని, సెల్‌ఫోన్ భూతం కోట్లమంది ఆరోగ్యాన్ని మింగేస్తుందని, కృత్రిమమేథ వికృతరూపం దాల్చి, లక్షలాదిమంది కడుపు కొడతుందని… ఇలా వంగా బాబా చెప్పిన మిగతా జోస్యాలు సాదాసీదాగా కనిపించి, జస్ట్ ఫ్లూక్ అనిపించొచ్చు. కానీ, వాతావరణంలో అంతులేని తేడాలొచ్చి చండ ప్రచండ ఎండలు, భూకంపాలు, రాకాసి వరదలు సంభవిస్తాయట.
వంగా బాబా జోస్యం ఝడిపించడం అక్కడితోనే ఆగలేదు. తూర్పులో పుట్టే ఒక యుద్ధం పశ్చిమాన్ని చిత్తుచిత్తు చేస్తుందట. రష్యా నుంచి ఎలివేట్ అయ్యే ఒక పవర్‌ఫుల్ లీడర్.. ప్రపంచం మొత్తాన్ని ఒంటిచేత్తో ఏలబోతున్నాట్ట. 2026లో మన ప్రపంచం మరో ప్రపంచాన్ని టచ్ చేస్తుందని, ఏలియన్స్‌తో చాటింగ్ సాధ్యమౌతుందని వంగా బాబా నోటివాక్కు చెబుతోంది. కానీ, వీటిలో దేనికీ సైంటిఫిక్ ప్రూఫ్ లేదు.
ఆడియో రికార్డింగులూ లేవు. కాకపోతే, శాంతిశాంతి అంటూనే నక్కజిత్తులతో యుద్ధాల్ని ఎగదోస్తున్న డొనాల్డ్ ట్రంప్, పీస్ డీల్ తర్వాత కూడా భగ్గుమంటున్న మిడిలీస్ట్, మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ వార్.. ఇవన్నీ థర్డ్ వరల్డ్‌వార్‌కి సంకేతాలేగా? వంగా బాబా జోస్యానికి బలానిచ్చేవేగా? క్రూరమైన యుద్ధాలతో యూరప్ ఖండం అల్లకల్లోలమౌతుందని, గ్రహాంతర వాసులతో కాంటాక్ట్ ఏర్పడుతుందని, అదే మానవాళికి పెను ముప్పుగా మారుతుందని మరో మహా జ్యోతిష్కుడు నోస్ట్రడామస్ కూడా చెప్పాడు.
మరి, బాబా వంగా చెప్పిన భవిష్యవాణి కూడా నిజమౌతుందా? నిజంగానే 2026 డేంజరస్ ఇయర్ కాబోతోందా? వరల్డ్ క్లాస్ సైంటిస్టుల్నే కాదు సామాన్యుల్లో ఇదో రకం కలవరం.
